భద్రతా బలగాల ఎదురు దాడి
20 రౌండ్‌ల కాల్పులు జరిపిన్డ మావోయిస్టులు
40 మంది పాల్గొనట్లు పోలీస్ వర్గాల అంచనా
రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కోసం వెళ్తున్న పౌరహక్కుల నేతలు అరెస్ట్… విడుదల
భద్రత బలగాల క్యాంపుపై మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి రాకెట్ లాంఛర్లతో దాడికి దిగారు. సుమారు 20 రౌండ్‌లు కాల్పులు జరిపినట్లు పోలీస్ ఉన్నతాధికారుల ద్వారా సమాచారం. ఈ దాడిలో సుమారు 40 మంది మావోయిస్టులు పాల్గొనట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాల క్యాంపు ఉన్నది. ఈ క్యాంపుపై శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు మెరుపు దాడి చేసారు. దీని ప్రతిఘటించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీనితో మావోయిస్టులు ఆ ప్రాంతం నుండి పారిపోయినట్లు తెలుస్తుంది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి దిగారు. పోలీస్ బలగాలను మట్టుపెట్టేందుకు క్యాంపుపై దాడి చేసారు. పోలీసులు కూడ ఎదురుకాల్పులు జరపడంతో అక్కడి నుండి మావోయిస్టులు పారిపోయారు.
అర్ధరాత్రి కావడం వలన మావోయిస్టులు ఏమి చేయలేని పరిస్థితిలో అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి నుండి ఇప్పటి వరకు సుమారుగా 170 మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. మావోయిస్టు పార్టీకి తగులుతున్న ఎదురుదెబ్బలకు ప్రతీ కార చర్యగా ఈ దాడులకు దిగినట్లు తెలుస్తుంది. గత వారం రోజుల క్రితం కరకగూడెం ప్రాంతంలోని రఘునాధపాలెం ప్రాంతంలో మావోయిస్టులకు , పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఘటనను మావోయిస్టులు జీర్ణించుకోలేక లేఖ విడుదల చేసారు.
త్వరలోనే ప్రతీకారచర్య ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. మావోయిస్టుల ఏరివేతకు కేందప్రభుత్వం ఇటీవలేభారీగా బలగాలను అటవీ ప్రాంతంలోకి పంపించింది. ఎట్టి పరిస్థితిలో మావోయిస్టులు ఉండటానికి వీలులేదు అన్నట్లుగా కేంద్రం పక్కాగా ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే మావోయిస్టుల ఏరివేతకు భారీగా భద్రత బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. భద్రతా బలగాలను మట్టుపెట్టేందుకు మావోయిస్టు పార్టీ కూడ వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.