సామూహిక జీవన విధానానికి ప్రతీక

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
 హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్01: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని‌ గౌరమ్మను సీఎం ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page