ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం..

  • ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు భర్తీ..
  • అన్ని లెక్కలు తేలుస్తాం.. అన్నీ బయటకు తీస్తాం
  • కేసీఆర్‌.. అసెంబ్లీకి రా..! చర్చిద్దాం..
  • కేటీఆర్‌ ఊచలు లెక్కబెట్టాల్సిందే..
  • రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కోసం సేకరించిన భూముల్లో హరీశ్‌ ‌రావు ఫాంహౌస్‌
  • కొండపోచమ్మ సాగర్‌ ‌కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌కు నీళ్ల కోసమే..
  • వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

‘‘పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి ఉద్యోగాలు వొస్తాయని అనుకుంటే భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు .. కొంత మంది రౌడీ మూకలను తయారు చేసి అధికారులపై దాడి చేయించారు ..పైగా కేసులు పెట్టారని అంటున్నారు. నీ కొడుకు.. నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్‌. .? ‌తెలంగాణలో పరిశ్రమలు పెట్టోద్దా.. మా పిల్లలకు ఉద్యోగాలు రావొద్దా? పదేళ్లు పాలించిన మీరు భూసేకరణ చేయలేదా? కొండమ్మ పోచమ్మ సాగర్‌ ‌లో భూములు గుంజుకున్న చరిత్ర మీది..కొడంగల్‌ ‌లో భూసేకరణ చేస్తే మీకు కడుపుమంట దేనికి? కొడంగల్‌ అం‌టే మీకు ఎందుకు ఇంత కక్ష..అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే…’’
ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 20 :  ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఈ కరీంనగర్‌ ‌గడ్డపై నుంచే సోనియమ్మ మాట ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మాట ఇస్తే ఎంత త్యాగానికైనా సిద్దమవుతుందని సోనియమ్మ నిరూపించారన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం రూ.679 కోట్ల అభివృద్ది కార్యక్రమాలను సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌ప్రసంగించారు.

తన పాదయాత్ర సమయంలో రాజన్న సాక్షిగా కేసీఆర్‌ ‌ను గద్దె దింపాలని మొక్కుకున్నానని, రాజన్న దయతో తాను నేడు సీఎంగా ప్రజల ముందుకు వొచ్చానని తెలిపారు. జిల్లాను అభివృద్ది పథంలో నడిపించేందుకు తాను ఎప్పటికీ ముందుంటానని హామీ ఇచ్చారు. పెండింగ్‌ ‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. , ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నామని, మిడ్‌ ‌మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడే మాట ఇచ్చామని తెలిపారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పాదయాత్రలో చెప్పామని, కాంగ్రెస్‌ ‌హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తేనే పూర్తవుతాయని ఆనాడే చెప్పానని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నవంబర్‌ 30 ‌తేదీలోగా మళ్లీ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పర్యటించి ప్రాజెక్టులను పూర్తి చేసే చర్యలకు శ్రీకారం చుడతారని తెలిపారు.

దేశానికి దశ-దిశ సూచించిన నేత పీవీ పుట్టిన గడ్డ కరీంనగర్‌ అని అన్నారు. కరీంనగర్‌ ‌లో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు ఏం ఒరిగింది? అని సీఎం రేవంత్‌ ‌ప్రశ్నించారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం పార్లమెంట్‌ ‌లో ప్రశ్నించారా? జిల్లా అభివృద్ధికి చిల్లి గవ్వ తెచ్చారా..?  అని నిలదీశారు. అలా చేసి ఉంటే జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలేవా? అని అన్నారు. పదేళ్లలో 20 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్‌.. 100 ‌కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి ఎందుకు చేయలేదు? ప్యాకేజీ 9 ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు.

గల్ఫ్ ‌కార్మికుల కోసం గల్ఫ్ ‌బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ ‌కార్మికులకు రూ.5లక్షల ప్రమాదబీమా అందిస్తున్నామన్నారు. కేసీఆర్‌ ‌పదేళ్లలో చేయలేని పనులను మేం పది నెలల్లో చేసి చూపించామన్నారు. ఏలేశ్వరం పోయినా శనేశ్వరం వొదలలేదన్నట్లు.. వాళ్లను ఓడించినా వాళ్ల తీరు మారలేదని, పార్లమెంట్‌ ఎన్నికల్లో సున్నా వొచ్చింది.. ఇప్పుడు వాళ్ల వేషాలు చూస్తోంటే వాళ్ల మెదడు కూడా పోయినట్టుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు ఏం వెలగబెట్టారని.. పదినెలల్లో మనల్ని దిగి పొమ్మంటున్నారు..? మీ నొప్పికి  మా కార్యకర్తలకు మందు ఎక్కడ పెట్టాలో తెలుసు అంటూ సెటైర్లు వేశారు. రుణమాఫీపై దుష్ప్రచారం చేసున్న మీకు .. ధైర్యం ఉంటే నిజాన్ని ఎదుర్కొనే సత్తా ఉంటే అసెంబ్లీకి రా కేసీఆర్‌ అం‌టూ సవాల్‌ ‌విసిరారు.పది నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇచ్చామని, దీనిపై లెక్క కట్టి చూపిస్తానన్నారు. ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. .. మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో… మా పదినెలల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చర్చకు పెడదామని అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వొస్తున్నాయని, అప్పుడు చూద్దాం కేసీఆర్‌ అం‌టూ సీఎం సవాల్‌ ‌విసిరారు.

ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్‌ ‌ది అని మండిపడ్డారు.
ఈ ఏడాది 66 లక్షల 1కోటి 53లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం పండిందని, ఆయన కట్టిన కాలేశ్వరం కుంగిపోయినా… ఒక్క చుక్క కాలేశ్వరం నీళ్లు లేకుండా 1కోటి 53లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం పండిందని వివరించారు.  పదేళ్లలో కేసీఆర్‌ ‌ప్రాజెక్టుల కోసం లక్ష 23 వేల కోట్లు ఖర్చు చేశారని, ఏ ప్రాజెక్టునైనా పూర్తిచేశారా? ప్రజలకు నీళ్లు ఇచ్చామని చెప్పగలరా? అని నిలదీశారు. రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కోసం సేకరించిన భూముల్లో హరీశ్‌ ‌రావు ఫామ్‌ ‌హౌస్‌ ‌కట్టుకున్నారని ఆరోపించారు. అన్ని లెక్కలు తేలుస్తామని,. అన్నీ బయటకు తీస్తామని సీఎం ధ్వజమెత్తారు. కొండపోచమ్మ సాగర్‌ ‌కట్టింది కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కు నీళ్లు తీసుకెళ్లేందుకేనని, బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బామ్మర్ది డ్రగ్స్ ‌తీసుకున్నా పట్టుకోవద్దన్నారని..

పేదలకు ఒక చట్టం నీకో చట్టమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు నారాయనపెట్‌ ‌కొడంగల్‌ ఎత్తిపోతల పూర్తి చేద్దామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని అన్నారు. పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి ఉద్యోగాలు వొస్తాయని అనుకుంటే భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది రౌడీ మూకలను తయారు చేసి అధికారులపై దాడి చేయించారని, పైగా కేసులు పెట్టారని అంటున్నారు. నీ కొడుకు.. నీ అల్లుడు భాషను మీరు సమర్థిస్తారా కేసీఆర్‌. అం‌టూ ప్రశ్నించారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టోద్దా.. మా పిల్లలకు ఉద్యోగాలు రావొద్దా? పదేళ్లు పాలించిన మీరు భూసేకరణ చేయలేదా? కొండమ్మ పోచమ్మ సాగర్‌ ‌లో భూములు గుంజుకున్న చరిత్ర మీది..

కొడంగల్‌ ‌లో భూసేకరణ చేస్తే మీకు కడుపుమంట దేనికి? కొడంగల్‌ అం‌టే మీకు ఎందుకు ఇంత కక్ష..
అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూములు కోల్పోయి బాధలో ఉన్న వారిని మా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని, పరిహారం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కేటీఆర్‌ ‌దిల్లీ కాదు చంద్రమండలం పోయి ఫిర్యాదు చేసుకున్నా సరే… చేసిన కుట్రకు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని హెచ్చరించారు. చివరగా అసెంబ్లీకి రా సామి.. ఒక్కసారి రా.. చర్చింద్దాం అంటూ కేసీఆర్‌ ‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page