నేడు యాదాద్రికి సిఎం రేవంత్‌

‌పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
వలిగొండ వద్ద  మూసీ పునరుజ్జీవ
ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్ర సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా  కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. పుట్టినరోజు వేళ.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి షెడ్యూల్‌ ‌ను, అలాగే పాదయాత్ర రూట్‌ ‌మ్యాప్‌ ‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ప్రకటించారు. నవంబర్‌ 8‌న శుక్రవారం హెలికాప్టర్‌లో కుటుంబ సమేతంగా ఉదయం 8:45 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుంటారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర
మధ్యాహ్నం ఒంటి గంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేరుకోనున్నారు. ‘‘మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర’’ పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో భాగంగా.. మూసీ నది వెంట ఉన్న పరీవాహక ప్రాంతాల మీదుగా  6కిలోటర్లు పాదయాత్ర చేస్తూ.. అక్కడి రైతులతో ముచ్చటించనున్నారు. వారి బాధలు తెలుసుకుంటూనే.. మూసీ పునరుజ్జీవంపై భరోసా కల్పించనున్నారు.

ఈ క్రమంలోనే.. భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను కూడా రేవంత్‌ ‌రెడ్డి సందర్శించనున్నారు. మూడుపాయల వద్ద ఉన్న భీమలింగాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం మూసీ పరీవాహక ప్రాంతాల రైతులతో రేవంత్‌ ‌రెడ్డి సమావేశమవుతారు. మూసీ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్‌ ‌బయలుదేరుతారని ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌, ఎమ్మెల్యే కుంభం అనిల్‌ ‌కుమార్‌ ‌పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page