6న సమగ్ర కులగణన కు సహకరించండి

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి  అధికారుల పర్యవేక్షణలో..
పాల్గొననున్న  85,000 మంది ఎన్యూమరేటర్లు.. ప్రతి 10 మంది  ఎన్యూమరేటర్లుకు ఒక పరిశీలకుడు
ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి..:రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ 
హైదరాబాద్ ,ప్రజాతంత్ర,నవంబర్ 01: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే   ఫిబ్రవరి 4 న జరిగిన మంత్రి మండలి నిర్ణయము మేరకు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది, రాజకీయ మరియు కులాల సర్వే (కుల గణన)) చేపట్టాలని ఈ క్యాబినెట్ తీర్మానించిందని పేర్కొంటూ రాష్ట్రంలో   రాష్ట్ర  ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణన పై రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు లేఖ శుక్రవారం లేఖ విడుదల చేసారు. రాష్టములో వెనుకబడిన తరగతుల, ఎస్‌సి&ఎస్‌టి పౌరులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది రాజకీయ అవకాశాలకు ప్రణాళికలు  రూపొందించి  అమలు చేయడానికి గాను  శాసన సభలో ఏకగ్రీవంగా తీర్మానించడమైనదనీ .. అందుకు  అనుగుణంగా జి.ఓ.ఎమ్ ఎస్ . నెం. 26, తేది. 15.3.2024 ప్రకారము కుల గణన చేయుటకు  తెలంగాణ బి.సి. కమిషన్  తీర్మానం క్రమము బి.సి. సంక్షేమ శాఖ ద్వారా 150 కోట్ల రూపాయలను విడుదల చేయడం ప్రక్రియ ప్రారంభం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.
 రాష్ట్రంలో ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాడి, రాజకీయ మరియు కులాల సర్వే) కులగణన చేయుటకు గాను జి.ఓ.ఎం యెస్. నెం. 18, తేది. 10.10.2024 ద్వారా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ను నోడల్ డిపార్ట్ మెంట్ గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీచేసింది . నవంబర్ 6 న  85,000 మంది ఎన్యూమరేటర్లు ప్రతి 10 మంది  ఎన్యు మరేటర్లకు ఒక పరిశీలకుడుగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి  అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటికి సమగ్ర సమాచార సేకరణ చేసి డాటా ఎంట్రీ చేయడముతో పాటుగా 30 నవంబర్ లోపు   సమాచార సేకరణ పూర్తి చేయాలని ప్రణాళికలతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమమునకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు . దేశంలో తొలిసారిగా  మరియు రాష్ట్రంలో రాహుల్ గాందీ  మాట ప్రకారము జరుగుతున్న ఈ సర్వేను ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ సర్వే రాబోయే కాలములో అన్ని రకాల పథకాలు అందుటకు మరియు ఇది ఒక మెగా హెల్త్ చెకప్ లాగా సమాచారముతో పాటుగా భవిష్యత్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది కావునా తప్పకుండా ప్రతి ఒక్కరూ సమాచారము సేకరిస్తున్న వారు మరియు సమాచారము తెలుపుతున్న ప్రతి తెలంగాణ పౌరుడు  సర్వే లో భాగస్వాములై సహరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page