సైబర్‌ ‌నేరస్తుల మాయ‌లో ప‌డొద్దు..

ఆద‌మ‌రిస్తే ఉన్నదంతా దోపిడీ
సైబర్‌ ‌సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ ‌బాబు
సైబర్‌ ‌నేరాలు 24 శాతం పెరిగాయన్న సిపి ఆనంద్‌  

‌టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్‌ ‌దాడులు పెరిగిపోతున్నాయని ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి జేబులు ఖాలీ చేయాలని కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని చెప్పారు. సైబర్‌ ‌సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌-2024 ‌హ్యాక్‌ 2.0‌ను జ్యోతి ప్రజ్వల‌న చేసి మంత్రి శ్రీధర్‌ ‌బాబు ప్రారంభించారు. అనంతరం సైబర్‌ ‌నేరాలపై అవగాహన కోసం చిత్రీకరించిన వీడియోలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా సైబర్‌ ‌సెక్యూరిటీ సమ్మిట్‌ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సమ్మిట్‌ ‌ద్వారా ప్రజలకు సైబర్‌ ‌మోసాలపై మరింత అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.  హ్యాక్‌ 2.0 ‌కార్యక్రమానికి టాలీవుడ్‌ ‌నటుడు అడివి శేష్‌ ‌సైతం హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ.. ‘సైబర్‌ ‌నేరాల నిర్మూలనకు హ్యాక్‌ ‌సమ్మిట్‌లో నిపుణుల సూచనలు, సలహాలు కీలకం అవుతాయి. సైబర్‌ ‌సెక్యూరిటీకి వారి అమూల్యమైన సూచనలు ఎంతో అవసరం. సైబర్‌ ‌నేరాలు కట్టడి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. టీజీ సైబర్‌ ‌సెక్యూరిటీ బ్యూరో ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నాం. హైదరాబాద్‌ ‌రియల్‌ ‌గ్లోబల్‌ ‌సైబర్‌ ‌సిటీగా రూపొందుతోంది. ప్రజా శ్రేయస్సు కోసం సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. సైబర్‌ ‌మోసాలకు గురి కాకుండా తెలంగాణ ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మోసం చేసేందుకు కేటుగాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మాటలు చెప్పి బురిడీ కొట్టించే యత్నం చేస్తారు. అపరిచితుల నుంచి వచ్చే ఎటువంటి ఫోన్‌ ‌కాల్స్, ‌మెయిల్స్ ‌లేదా మెసేజ్‌లకు స్పందించవద్దు. ఒకవేళ స్పందిస్తే బ్యాంకు ఖాతాల్లోని నగదును ఇట్టే మాయం చేస్తారు. ఈ సైబర్‌ ‌నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కోట్ల రూపాయలు రికవరీ చేసి బాధితులకు అందజేశాం అని చెప్పారు.

ఈ ఏడాది సైబర్‌ ‌నేరాలు 24 శాతం పెరిగాయని హైదరాబాద్‌ ‌నగర సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో 36 రకాల సైబర్‌ ‌నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ మధ్య కాలంలో డిజిటల్‌ అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతులే నేరస్థుల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్నారన్నారు. ఇటీవలే 28 మంది సైబర్‌ ‌నేరగాళ్లను రాజస్థాన్‌లో అరెస్టు చేశారని గుర్తుచేశారు. వారంతా దేశ వ్యాప్తంగా 243 కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు.. 28 కేసులు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. సుదూర ప్రాంతాల్లో కూర్చుని సైబర్‌ ‌నేరస్థులు నేరాలకు పాల్పడుతున్నారు. ఇతర రాష్టాల్రకు వెళ్లి వారిని అరెస్టు చేయడం సవాళ్లతో కూడుకున్న పని. అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. చాలా సవాళ్ల మధ్య సైబర్‌ ‌నేరస్థులను తెలంగాణ పోలీసులు పట్టుకువస్తున్నారు. ఈ సంవత్సరం రూ.35.8 కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చామని సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. కార్యక్రమంలో సైబర్‌ ‌సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ ‌శిఖా గోయల్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page