తయారీ, సరఫరాపై ముడిసరుకు రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం
న్యూట్రల్ ఆల్కోహాల్ ధరల మార్కెట్లో ఒడిదుడుకులు
ఆల్కోహాల్ పరిశ్రమలో ప్రభుత్వ ప్రమేయం
ప్రభుత్వాల నుంచి దొరకని ఆశించిన మద్దతు
వివరాలు వెల్లడించిన లండన్ మద్యం కన్సల్టెన్నీ సంస్థ ఐడబ్యుఎన్‌ఆర్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,సెప్టెంబర్ 15 : వొచ్చేవన్నీ పండగలే. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. జనం కూడా రేటును చూడడం లేదు. ఎంతకైనా తెగించి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. పైగా వర్షాకాలం నడుస్తోంది. రానున్నది శీతాకాలం. లిక్కర్ పరిశ్రమ చీప్ లిక్కర్, ఖరీదైన మద్యం అమ్మకాలను విశేషంగా పెంచుకుంది. ఈ ఏడాది సుదీర్ణకాలం ఎన్నికల పక్రియ జరిగింది. పైగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీని వల్ల మద్యం అమ్మకాలు ఆశించినట్లుగా లేవనే అసంతృప్తి పరిశ్రమల వర్గాలు, రిటైలర్లలో ఉంది. దిల్లీకి చెందిన భారతీయ మద్యం బేవరేజ్ సమాఖ్య డైరెక్టర్ జనరల్ అనంత్ ఎన్ అయ్యర్ మాట్లాడుతూ, మొదటి త్రైమాసిక కాలం కంటే రెండో త్రైమాసిక కాలంలో మద్యం అమ్మకాలు బాగున్నాయని చెప్పారు. వొచ్చే మూడు, నాలుగు త్రైమాసిక కాలాలు ఇంకా జోరుగా ఉంటాయని మంచి లాభాలు వొస్తాయని, మద్యం మార్కెట్ పాజిటివ్‌గా పండుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సంస్థ దేశంలో 20 సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. భారతీయ లిక్కర్ పరిశ్రమ సైజు 32 బిలియన్ డాలర్లు, లండన్‌కు చెందిన మద్యం కన్సల్టెన్సీ సంస్థ ఐడబ్యుఎన్‌ఆర్ ఈ వివరాలను వెల్లడించింది. 2028 నాటికి మరో ఏడు బిలియన్ డాలర్లు పెరుగుతుందని, మద్యం మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉందని ఈ కన్సెల్టెన్నీ సంస్థ అంచనా వేసింది. విస్కీ బీర్ల ఉత్పత్తి వినిమయం బాగా ఉందని పేర్కోంది. దేశంలో 440 మంది లేదా 33 శాతం మందికి లీగల్ గా మద్యం సేవించే అవకాశం ఉందని ఎకనామిక్ సర్వేలో తేలింది. దేశంలో లిక్కర్ పరిశ్రమ వివరాలను విశ్లేషిస్తే.. 2023వ ఆర్థిక సంవత్సరంలో 385 మిలియన్ల కేసులను విక్రయించారు. 2022వ ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 14 శాతం ఎక్కువగా విక్రయాలు నమోదయ్యాయి. లాభాలు ఉన్నాయి. అదే నమయంలో మార్కెట్ కొన్ని వత్తిడులకు కూడా లోనైంది. దీనికి సౌందర్య సాధనాలు, ఉత్పత్తుల అమ్మకాలు సాలీనా 12 నుంచి 14 శాతం పెరుగతున్నాయి. మద్యం విక్రయాల నిపుణులు అయ్యర్ భావించినట్లుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల మద్యం మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. జీఎస్టీ పరిధిలో మద్యం ఉత్పత్తులు లేవు.
రాష్ట్ర ప్రభుత్వాలే మద్యంపై లెవీ, అమ్మకం పన్నులను విధిస్తుంటాయి. రాష్ట్రాలకు మద్యం అమ్మకాల వల్ల మంచి ఆదాయం వొస్తుంటుంది. రాష్ట్రాలకు మద్యం ఒక పెద్ద ఆదాయం వనరు అని చెప్పవొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు మద్యం అమ్మకాల వల్ల ఆదాయం వొస్తుంటుంది. అందుకే మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వాలు బంగారు బాతుగుడ్డుగా భావిస్తాయి. ఏడాది కాలంగా ఎథనాల్ రేట్లు పెరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో వీటి రేట్లు 40 శాతం పెరిగాయి. బార్లీ, మొక్కజొన్న, చెరుకు రేట్లు పెరుగుతున్నాయి. ఈ వివరాలను ఆర్థిక వేత్త మనోరంజన్ శర్మ చెప్పారు. దీని వల్ల ఆర్ధిక రంగంలో సమతుల్యత దెబ్బతింటోంది. ఈ ముడిసరుకు రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం మద్యం తయారీ, సరఫరాపై తీవ్రంగా ఉంటోందని శర్మ చెప్పారు. ఆల్కోహాల్ పరిశ్రమలో ప్రభుత్వ ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. దీని వల్ల మద్యం పరిశ్రమ ఓడిదుడుకులకు లోనవుతోంది.
ఆల్కోహాల్ పరిశ్రమలో ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆల్కోహాల్ పరిశ్రమపై అందుకు వినియోగించే ధాన్యాల రేట్ల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం వల్ల మార్జిన్లు గణనీయంగా పడిపోతున్నాయి. అదనపు న్యూట్రల్ ఆల్కోహాల్ ధరల మార్కెట్లో ఒడిదుడుకులు పెచ్చుమీరుతున్నాయి. దీని వల్ల మద్యం పరిశ్రమ, అమ్మకాలు, రేట్లపై తీవ్రంగా ఉందని తిలక్‌నగర్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మద్యం తయారీ పరిశ్రమ ఎప్పుడూ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. కాని ఇటీవల కాలంలో ఈ రంగంలో కూడా సంక్షోభం ఉంటోందని ఆర్థిక వేత్త మనోరంజన్ శర్మ చెప్పారు. భారత్‌లో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద మద్యం మార్కెట్ మన దేశంలో ఉంది. కాని డిమాండ్‌కు తగ్గట్టుగా సరసమైన ధరలకే నాణ్యమైన లిక్కర్ అందించేందుకు పరిశ్రమలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వాల నుంచి ఆశించిన మద్దతు ఉండదు.