పండుగల సందర్బంగా డీజే లతో అసౌకర్యం

  • అయినా ..ప్రజలు భక్తులు ఎంతో సహకరించారు
  • చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయి
  • మావోయిస్టు లు తెలంగాణకు వొచ్చే ప్రయత్నం చేస్తున్నారు
  • మీడియా సమావేశంలో డీజీపీ జితేంధర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో మొత్తం 1,36,638 గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగిందని.. చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయని డీజీపీ జితేంధర్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… 5879 నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేశాం.. కంట్రోల్ రూమ్ ని డిజిపి కార్యాలయం లోనూ ఏర్పాటు చేసి మానిటర్ చేశాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరెట్ ల పరిధుల్లో గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది కృషి చేసారు. బందోబస్తులో 15,400 మంది జిల్లాల నుంచి పాల్గొన్నారు. 12000 మంది ఎస్సై, కానిస్టేబుల్ ట్రైనీ లు ఉన్నారు. వీరిని కూడా బందోబస్తులో వినియోగించామని తెలిపారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మొత్తము 300 ప్రాంతాల్లో యాత్రలు జరిగాయి.

ప్రజలు భక్తులు ఎంతో సహకరించారు. డీజే ల ఏర్పాటు, శభ్ధా కాలుష్యం కొంత నగర వాసులను ఇబ్బంది పెట్టింది. డీజేల విషయంలో త్వరలో గైడ్లైన్స్ విడుదల చేస్తాం వినికిడి సమస్యలు వొచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించాలి. జైనూర్ ఘటన దురదుష్టకరం. ఈ కేసులో 38 మందిని అరెస్ట్ చేశాము. అక్కడ పరిస్థితులు చేయి దాటి పోవడం తో పలువురిని అరెస్ట్ చేశాము. అక్కడ అలసత్వం వహించిన డీఎస్పీ పై వేటు వేశాము. సంగారెడ్డి సాంఘిక బహిష్కరణ పైన కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నాము.

తెలంగాణ మావోయిస్టు ప్రాబల్యం లేదు. మావోయిస్టు ప్రాబల్యం కోసం తెలంగాణకు వొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ చుట్టుపక్క రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం ఉంది. మావోయిస్టు కట్టడి కి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో స్పెషల్ టీమ్ విచారణ చేస్తున్నాం.. హైదరాబాద్ సీపీ , వెస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారు. కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి నేను కామెంట్ చేయలేను.. ప్రభాకర్ రావు , శ్రవణ్ రావు కు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి కొంత సమయం పట్టింది. రెడ్ కార్నర్ నోటీసులు కోసం ఇంటర్ పోల్ కి లేఖ రాశాము.. సీబీఐ కి రాగానే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యు అవుతుందని డీజీపీ జితేంధర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page