తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా అందించే కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ లోని భారత్ స్కౌట్స్ భవనంలో ఈ నెల 22వ తేదీన జరిగే సభలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. గతంలో ప్రముఖ సాహితీవేత్తలు డా.ఏనుగు నరసింహారెడ్డి, డా.నాళేశ్వరం శంకరం తదితరులకు ఈ పురస్కారం అందజేశారు. ఇదిలాఉండగా ఆచార్య పాకాల యశోదారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారానికి ప్రముఖ కవయిత్రి వీణారెడ్డి ఎంపికయ్యారు. కాళోజీ, యశోదారెడ్డి పురస్కారాలతో పాటు బోధనారంగంలో విశిష్ట కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఈ సభలో అందజేస్తారు.
ఉపాధ్యాయ దినోత్సవం, కాళోజీ జయంతి, పాకాల యశోదారెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథులుగా సుప్రసిద్ధ కవులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప హాజరవుతారు. ప్రముఖ కవి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి, రిటైర్డు ఆర్.డి.ఓ. మద్ది అనంత్ రెడ్డి, సుప్రసిద్ధ సాహితీవేత్తలు డా.నలవోలు నరసింహా రెడ్డి, డా.వంగీపురం శ్రీనాథా చారి, ప్రముఖ విద్యా వేత్త లక్ష్మణ్ గౌడ్, ఆచార్య పాకాల యశోదా రెడ్డి కూతురు పాకాల లక్ష్మి రెడ్డి అతిథులుగా పాల్గొంటారు. కవులు, రచయితలు, పాఠశాలల ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
– శ్రీమతి రావూరి వనజ, అధ్యక్షులు
శ్రీమతి జి.శాంతారెడ్డి,
కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు
తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ, మహబూబ్ నగర్