విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ
జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం..
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టో బర్ 26 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడి టేషన్ కా ర్డుల మంజూ రుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శ కాల ను రూపొం దించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం తొలిసారి బూర్గుల రామ కృష్ణా రావు భవనంలో సమావేశమైంది. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, సియాసత్ న్యూస్ ఎడిటర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, హిందూ పొలిటికల్ ఎడిటర్, ఆర్ రవి కాంత్ రెడ్డి, సీనియర్ ఫొటో జర్నలిస్ట్, కె. నరహరి, సమాచార పౌర సంబంధాల శాఖ జాయి ంట్ డైరెక్టర్ డి.యస్.జగన్ పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్ర హైకోర్టు తీర్పులు, నూతన మార్గదర్శకాలు, వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న అక్రిడిటేషన్ కమిటీ నిబంనలను, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర మీడియాకు అక్రిడిటేషన్ల అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలపై జర్నలిస్టు యూనియన్లు/అసోసియేషన్లు, ప్రెస్‌క్లబ్‌లు, వ్యక్తుల నుంచి ప్రత్యేక కమిటీకి రాతపూర్వక సలహాలు, సూచనలు అందించాలని కోరారు. నవంబర్ 15లోగా వాటిని సమాచార పౌర సంబంధాల శాఖ, జాయింట్ డైరెక్టర్ (ఎంఆర్)కు సూచనలు అందజేయాలని కమిటీ సభ్యులు కోరారు.