సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించం

సొంత ప్రయోజనాల తప్పుడు వదంతులు
• ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి  విధుల్లో 87వేల ఎన్యుమరేటర్లు
• రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 15: ‌కొందరు కావాలనే వారి ప్రయోజనాల కోసం సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హెచ్చరించారు. సర్వేలో ఎలాంటి బ్యాంక్‌ ‌వివరాలు అడగటం లేదని స్పష్టం చేశారు. 87వేల ఎన్యుమరేటర్లను పెట్టీ సర్వే జరిపిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి అయ్యిందని తెలిపారు. సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ…దేశానికి దిక్సూచిగా సర్వే నిలబడుతుందన్నారు. సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడటం లేదని చెప్పారు. సర్వేను అడ్డుకున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా అందరికీ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌గ్రంథాలయ చైర్మన్‌ ‌లింగమూర్తి పాల్గొన్నారు.

యువతకు ఉపయోగకరంగా గ్రంథాలయాలు..
గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు చదువుకోవడానికి ఉపయోగపడేలా ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 11 నెలల్లో 45 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. సిద్దిపేట గ్రంథాలయం రాష్ట్ర గ్రంథాలయాలకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. దివంగత ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ఐఐటీ, ఎయిమ్స్, ‌విద్యాలయాలు, సాంకేతికత రంగంలో అభివృద్ధి చేయడంతోనే నేడు దేశం ముందుకు వెళ్తోందన్నారు. నెహ్రూ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. బ్రాంచ్‌ ‌లైబ్రరీల సంఖ్య తక్కువగా ఉందని, కావాల్సిన మెటీరియల్‌ అం‌దించాలిని మంత్రి ఆదేశించారు.

చివరి గింజ వరకు కొంటాం..

రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు రాద్ధాతం చేయకుండా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాకో సీనియర్‌ అధికారిని నియమించి ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నామన్నారు. కాళేశ్వరం లేకున్నా కాళేశ్వరం ద్వారా పంటలు బాగా పండాయని బీఆర్‌ఎస్‌ ‌నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైస్‌ ‌మిల్లర్ల విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పారు. 20 మంది డీఫాల్టర్‌లు ఉన్నారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించి మీరు కొనుగోలులో పాల్గొనాలని కోరారు. 101 మంది రైస్‌ ‌మిల్లర్లు ఉన్నారని, వారు బ్యాంక్‌ ‌గ్యారంటీ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page