రైతుల కళ్ళలో ఆనందం కాదు..కన్నీళ్లు

  • రాష్ట్రంలో రెండు రకాల వరదలు..
  • ఒకటి వర్షాలతో అయితే…రెండోది  సిఎం అబద్దాల వరద
  • నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు..
  • సిఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారని, ఒకటి వర్షాలతో వొచ్చిన వరద అయితే, రెండోది చిల్లర ముఖ్యమంత్రి అబద్ధాల వరద అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వరదలతో వొచ్చిన బురదను కడుక్కోగలుగుతామని, కానీ ముఖ్యమంత్రి నోటి నుంచి వొస్తున్న మురుగు బురదను మాత్రం కడగలేకపోతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నోటి కంపు మోరీల కంపును మించి పోయిందన్నారు. ముఖ్యమంత్రి అనే ఇంగితం ఆయనకు లేదని, ఆయన భాష మాట్లాడటానికి తనకు విజ్ఞత అడ్డువస్తున్నదని అన్నారు.నాదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడతూ…తెలంగాణ ఉద్యమం తనను మరింత ఎత్తుకు చేర్చిందని,  కానీ సిఎం చరిత్ర కురుచ అని, అలాగే ఆయన భాష కురుచ అని, ఆ కురుచ తనం వల్ల ఆయనకు కల్గిన ఆత్మనూన్యత వల్ల పదే పదే తన పొడుగు గురించి మాట్లాడుతడని ఎద్దేవా చేశౄరు. ఇప్పటికీ 20 సార్లు తన ఎత్తు గురించి సిఎం మాట్లాడిండని, దాని గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించాలని హరీష్‌ ‌రావు హితవు పలికారు.
 రుణమాఫీ చెయ్యలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, ఆయన  దుర్మార్గ నిబంధనలతో రైతు సురేందర్‌ ‌రెడ్డి ప్రాణాలు తీసుకున్నాడని అన్నారు. రుణమాఫీ పూర్తి చేశానని సీఎం మాట్లాడుతున్నాడని, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అబద్ధాలు చెప్పాడని అన్నారు. సిఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి చౌరస్తాకు..లేదా తన నియోజకవర్గం సిద్దిపేటలోని వెంకటాపురం పోదామని, రుణమాఫీ అయిందని నిరూపిస్తావా…అంటూ సవాల్‌ ‌విసిరారు. వెంకటాపురం గ్రామంలో 122 మందిలో 82 మందికి రుణ మాఫీ కాలేదని, మొత్తం కోటి 13 లక్షల 74 వేలకు..కోటి 5 లక్షల మాఫీ జరగలేదన్నారు. 31 వేల కోట్లు చేస్తామని 17 వేల కోట్లు మాత్రమే చేశారని, సగం కూడా కాలేదని హరీష్‌ ‌రావు అన్నారు. పంట బోనస్‌ను బోగస్‌ ‌చేసిన సన్నాసి తాను నేను అనలేనా..అని ప్రశ్నిస్తూ..తనకు విలువలున్నాయి కనుక  ఆయనలా నోరు పారేసుకోలేనన్నారు. రుణమాఫీ చేసిన వారి వివరాలు తనకు పంపడం కాదని, తానే కానీ వారి వివరాలు సిఎంకు పంపిస్తున్నానని, తన వైపు ఒక వేలు చూపిస్తే నాలుగు వెళ్ళు ఆయన వైపు చూపిస్తాయన్నారు.
రైతుల కళ్ళలో ఆనందం కాదు, కన్నీళ్లు తెప్పించాడనిదుయ్యబట్టారు.• ండు లక్షల పైన మిత్తి ఉంటే కట్టిన వాళ్ళ లిస్ట్ ‌పంపుతున్నానని, దమ్ముంటే వాళ్లకు మాఫీ య్యాలని, మంత్రి తుమ్మల చెప్పింది కరెక్టా..సీఎం చెప్పింది కరెక్టా అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ మీద ఎవరు కరెక్ట్ అనేది తేల్చాలని హరీష్‌ ‌రావు ఈ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తె భూములు వాపస్‌ అన్నరని, అయితే ఫార్మా సిటీ పెట్టు లేదంటే భూములు ఇవ్యాలని డిమాండ్‌ ‌చేశారు. ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిండని, నిజమైన ఉచిత కరెంటు ఇచ్చింది కేసీఆర్‌ అని, మోటార్లు కాలకుండా ఇచ్చారన్నారు. రాజస్థాన్‌, ‌చతీస్‌ ‌గడ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌గెలిపిస్తే 5 ఏళ్ల లోపు ప్రభుత్వాలు పోయాయని, ఆయన అదృష్టం బాగుండి ఐదేళ్లు ఉంటాడని, మంచిగా ప్రవర్తించాలని హరీష్‌ ‌రావు హితవు పలికారు. చిల్లర రాజకీయాలు మాట్లాడవద్దని రేవంత్‌ ‌రెడ్డికి హితువు పలికారు. 40 లక్షల్లో 20 లక్షల మందికి రుణమాఫీ చేశారని,  రేషన్‌ ‌కార్డు నిబంధన పెట్టి కోతలు విధించారని, నాడు రేషన్‌ ‌కార్డు లేదు అని, ఇప్పుడు కార్డు చూసి పథకాలు అమలు చేస్తున్నారని హరీష్‌ ‌రావు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page