వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ఓరుగల్లు హోమియోపతి అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉచిత హోమియో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో హోమియోపతిక్ డాక్టర్లు లక్ష్మీనారాయణ, పవన్, శ్రీధర్, గీత, రేవతి, సాయికృష్ణ పేషెంట్లను పరీక్షించి హోమియో వైద్యాన్ని అందించారు. రామకృష్ణ సేవా సమితి పక్షాన ప్రధాన బాధ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస స్వామి, సూర్య, చిదర అంజనీ దేవి, బోయినపల్లి పార్వతి, పడిదల అనిత, లక్ష్మీరావు తదితరులు పాల్గొన్నారు.
ఇలాగే ప్రతి నెల రెండవ, నాలుగవ ఆదివారాలు ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించనున్నామని ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు, సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.