అప్పుడప్పుడు
ఒంటరిగా నిలుచొని
మనలోకి మనం
తొంగిచూసుకోవాలి
మనలోని మనసున్న మనిషి
మాయమైపోతున్నాడో
మనుగడ సాగిస్తున్నాడో
గమనించుకోవాలి
దారి తప్పుతున్నాడని
పిచ్చిపరుగులు తీస్తున్నాడని
మనసు అద్దం చూపిస్తే
సరిదిద్దుకోవాలి
మొత్తంగా
మనలోని మనిషితనం
కూలిపోకుండా జాగ్రత్తపడాలి
మనిషితనమే జీవగర్ర
అది కూలిపోయిన నాడు
మనమున్నా లేనట్టే..
నడిచే శవాలమైనట్టే..
౼ కార్తీక రాజు
హనుమకొండ
8977336447