భద్రాద్రి పేరుతో యుఎస్‌ఏ లో పలుచోట్ల కల్యాణాలు
భద్రాద్రి రామయ్య పేరును పెట్టడంపై దేవస్థానం ఈఓ రమాదేవి అభ్యతరం
దేవదాయ ధర్మాదాయశాఖకు ఫిర్యాదు
17న భద్రాచలంలో యుఎస్‌ఏ ఖగోళయాత్రలో భాగంగా కల్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు
భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 15 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి పేరుతో యుఎస్‌ఏలో కోట్ల రూపాయలు వసూలు చేసి ఆలయం నిర్మించి వివిధ ప్రాంతాల్లో భద్రాద్రి రామయ్య ఆలయం పేరుతో అక్కడ అర్చకులు కల్యా ణాన్ని నిర్వహిస్తున్నారని ఇది ఆలస్యంగా వెలు గులోకి రావడం జరిగిందని దీనికి తీవ్రంగా అభ్యతరం వ్యక్తం చేస్తున్నట్లు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎల్.రమాదేవి తెలిపారు. ఆదివారం చిత్రకూట మండపంలో జరిగినవ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భద్రాద్రి శ్రీ రామ ఆలయం పేరుతో యుఎస్‌ఏకు చెందిన ఆలయ నిర్వహకులు విరాళాలు సేకరి స్తున్నారని కనుగొన్నట్లు ఆమె తెలిపారు.
ఖగోళ యాత్రలో భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్‌ఏ పేరుతో భద్రాచలం పట్టణ ంలోని ఆర్యవైశ్య సత్రంలో 17వ తేది శ్రీ సీతారాముల కల్యాణం చేసేందుకు యుఎస్‌ఏ అర్చకులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఆరా తీయగా భద్రా చలం రామాలయం పేరుతోనే విరళాలు సేకరి స్తునట్లు ఆదారాలు ఉన్నట్లు ఈఓ తెలిపారు. ఇప్పటికే యుఎస్‌ఏలో భద్రాద్రి రామయ్య పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసారని పలు చోట్ల కల్యాణాలు కూడ చేయటం జరిగిందని ఈఓ తెలిపారు. భద్రాద్రి పేరుతో ఎవరైన విరాళాలు సేకరించిన భద్రాద్రి ఆలయం పేరును వాడిన కఠినమైన చర్యలు ఉంటాయని ఈఓ హెచ్చరించారు. ఈ విషయంపై దేవదాయ, ధర్మాదయ శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం భద్రాద్రి రామయ్య పేరు వాడి విరాళాలు సేకరించిన భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్‌ఏ వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని ఈఓ రమాదేవి హెచ్చరించారు. భద్రాద్రి రామయ్య పేరును ఉపయయో గించుకుని వసూళ్ళు చేయటమే కాకుండా ఏకంగా రామయ్య కల్యాణాన్ని భద్రాచలంలో ఆర్యవైశ్య సత్రంలో నిర్వహించేందుకు యుఎస్‌ఏ అర్చకులు ప్రణాళిక సిద్దం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించేందుకు యుఎస్‌ఏ నిర్వహకులు రావడం వలన అసలు విషయం బయటకు వచ్చినట్లు ఈఓ తెలిపారు. భద్రాద్రి రామయ్యపేరుతో వెబ్‌సైట్‌లు కూడ ప్రారంభించారని ఈఓ తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఈఓ వెల్లడించారు.