కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్ స్పష్టత
న్యూదిల్లీ, నవంబర్7: తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా వారు అవకాశాలు కోల్పోతారని అన్నారు. బీజేపీలోని కొందరు వ్యక్తులు తనను వ్యాపార వ్యతిరేకిగా (ఖీ2వ పేజీలో…)
చిత్రీకరిస్తున్నారని ఉద్యోగాల కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తానని అన్నారు. నేను వ్యాపార వ్యతిరేకిని అస్సలే కాదు. గుత్తాధిపత్యానికి, మార్కెట్ నియంత్రణ శక్తులకు వ్యతిరేకం అన్నారు.
కేవలం వేళ్ల సంఖ్యలో వ్యక్తులు ఆధిపత్యం చెలాయించడానికి తాను పూర్తిగా విరుద్ధమని అన్నారు. మేనేజిమెంట్ కన్‌స్టలెంట్‌గా నా కెరీర్‌ను ప్రారంభించా. వ్యాపార విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకోగలను‘ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఓ వీడియో పోస్టు చేశారు. దేశంలో కొందరు వ్యాపారవేత్తలు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఇటీవల ఓ ఆంగ్ల వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో రాహుల్ పేర్కొన్నారు. మార్కెట్‌ను నియంత్రిస్తున్న అటువంటి శక్తుల వల్ల అనేక వ్యాపారాలు క్షీణించాయని, ఉద్యోగాల సృష్టి కూడా కష్టమయ్యిందని అభిప్రాయపడ్డారు. అనేకమంది యువ వ్యాపారవేత్తలు ఇటువంటి గుత్తాధిపత్యాన్ని చూసి భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో రాహుల్ గాంధీ దీనిపై వివరణ ఇచ్చారు.