భారతీయ గ్రంథాలు… కీర్తి సంకేతాలు

అక్షరరూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక” అని ఆర్యోక్తి అక్షరం ఒక శక్తివంత మైన ఆయుధం. మానవుని భావనా తరంగాలు ఇతరులు స్పష్టంగా చదువ గలిగే ఒక కెమెరా దృశ్యాలు. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదువగలిగే సాధనం అక్షరం. మనిషి అయు ప్రమాణం వందేళ్ళయితే, గ్రంధ ఆయు ప్రమాణం అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ, గ్రంధ పూజను పుస్తకాల (సరస్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రులలో నిర్వ హించే ఆచారం కొనసాగు తున్నది. గ్రంథం పొరపాటున కాలికి తగిలితే, కళ్ళకు అడ్డుకునే సత్సంప్రదాయం భారతావనిలో ఉంది. గ్రంధానికి వయసు అనేది లేదు. అపౌరుషేయాలని భావించే వేదాలు మొదలుకుని, 2300 ఏళ్ళ క్రితం కౌటిల్యుడు అర్ధశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్టాధ్యాయి’, పతంజలి ‘యోగశాస్త్రం’, భరతముని ‘నాట్య శాస్త్రం’, హాలుని ‘గాధా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యాకాశాన ధ్వజాలలాగ రెపరెప లాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తున్నాయి.

గ్రంథానికి మృతి లేదు. అక్షర రూపం దిద్దుకున్న ఆలోచన, రాసిన వసువును బట్టి ఎంతకాలం మన గలుగుతుందో నిర్ణయ మవుతుంది. తాళపత్ర, బూర్జ పత్ర, తామ్రపత్ర, చర్మపత్ర రూపాలలో ఉన్నవి శిథిలా లైతే, తిరిగి ప్రతి లేఖనాలవు తాయి. మనిషి అజ్ఞానంతోనో, తెలియకో, విలువ స్వార్థపరుడై విధ్వంసం చేస్తే తప్ప, తామ్ర, శిలా రూపాలకు చావే లేదు కదా. భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంధాలు విదేశీయులను ఆకర్షించాయి. అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనే తలంపులో భాగంగా, భారత దేశాన్ని జయించడానికి వచ్చిన సందర్భంగా ఆయన గురువైన ఆరిస్టాటిల్, మన దేశ తత్వ సాహిత్యన్ని తిరిగి వచ్చేపుడు తెమ్మన్నాడు. బుద్ధ బోధన గ్రంథాలు, విదేశీ యాత్రికుల సందర్శనలకు హేతువులైనాయి, చైనా, టిబెట్, ఆఫ్ఘనిస్థాన్, మంగోలియా దేశీయులు భారత సందర్శనతో పాటు, ఇక్కడి బౌద్ధ సాహిత్య మూల, అనువాద రూపాలలో తీసు కెళ్ళారు. అక్షరం కనుగొన బడడానికి ముందు వేద వాఙ్మయం శ్రుత సాహిత్యంగా ఉండేది. శ్రాతం లిఖితం కావడం మానవ సంస్కృతీ వికాస పరి ణామ క్రమంలో ముఖ్య ఘట్టం.

వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ప్రస్తానత్రయం, భారత భాగవత రామాయణాలు, ఉప పురాణాలు, స్మృతి గ్రంధాలు, భారతీయ కథా సాహిత్యం, గ్రంథ రూపం సంతరించు కున్నాక, ప్రపంచంలో ఏ జాతీ, ఏ దేశం, భారత దేశానికి సాటి రావని, సర్వ ప్రపంచానికి ద్యోతకమైంది. భారతీయ సంస్కృ తిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం. ప్రాచీన తాళపత్ర గ్రంధాలు నలంద, తక్షశిల తది తర విశ్వ విద్యాల యాలలో భద్రపరచ బడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవ మేధ చాలాసార్లు మాడి మసి బొగ్గయింది. నేపాల్ విశ్వ విద్యాలయ గ్రంథాలయ భవనం ముందు యాభై వేల సంస్కృత అపురూప గ్రంథాలు తీవ్రవాదుల దాష్టీకానికి బలైన సంఘటన ఈ శతాబ్దపు విశాద ఘటన. ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతుల ప్రచురణ సులభమైంది. ఒకేసారి ఒక గ్రంథ వందలాది ప్రతులు సిద్ధ మయ్యే సౌలభ్యం ఏర్పడింది.

అంతకు ముందు రాజాస్థానాలలో ప్రతులు తయారు చేసే ఉద్యోగులు ఉండే వారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహు కష్టంతో కూడు కునేది. ముద్రణా యంత్రాల ఆధునీ కరణ జరిగింది. మరీ ముఖ్యంగా డిజిటలైజేషన్ వల్ల ముద్రణ నాణ్యమైన, అంద మైన ముద్రణలతో పాటుగా నేడు “ఈ గ్రంథాలు” ఉపయోగ పడు తున్నాయి. అయినా ముద్రిత గ్రంథ ఉపయోగం ఇంకా తగ్గు ముఖం పట్టలేదు. గ్రంథస్థ విషయాలు ప్రపంచ మంత విస్తృతం, ప్రపంచ వ్యాపితం అవు తున్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంధాలు, సృజనా త్మక సాహితీ గ్రంథాలు, ఆధ్యాత్మి కాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసికోల్లాస ప్రధానాలు, ఒకటేమిటి… వేలాది అంశాలు, లక్షలాది గ్రంథాలు, కోట్లాది పాఠకులు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి స్థితిలో పుస్తక ప్రదర్శన నిర్వహించడం చాలా ఉపయుక్తం.

1989 అక్టోబరు 29 నుంచి నవంబరు 8 వరకు విజయ వాడలో మొదటి పుస్తక ప్రదర్శన నిర్వహించారు. 1980ల్లో రాజమండ్రిలో ఒక దశాబ్దం పాటు పుస్తక మహోత్సవాన్ని అక్కడి నిర్వాహకులు నిర్వహించారు. ఆ పుస్తక ప్రదర్శనలో భాగంగా విజయ వాడలోని ప్రముఖ ప్రచురణ కర్తలు పుస్తక దుకాణాల యజమానులు పాల్గొనేవారు. రాజమండ్రి పుస్తక ప్రదర్శన నిలిపి వేయడంతో నేషనల్ బుక్ ట్రస్ట్ సహాయంతో 1989 అక్టోబరు 29 నుంచి నవంబరు 8 వరకు విజయవాడలో మొదటి పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఆ స్ఫూర్తితో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిఏటా విజయ వాడ పుస్తక మహోత్సవం గత 34 ఏళ్లుగా విజయ వాడ నగరంలో కొనసాగించడం అభినందనీయం.

బహు భాషలు, రచయితలు, గ్రంథాలు, ముద్రాపకులు, ఒక్కచోట చేరితే అదొక విజ్ఞాన విశ్వమే అవుతుంది. అందుకే చాలా మందికి ప్రీతిపాత్రం గ్రంథాల జాతరా. దేవున్ని జారతలో కొలిచినట్లే, గ్రంథాలను పరమ పవిత్రంగా భావించే సంస్కృతి భారతీయులది. కొనే వారు, చదివే వారు, సంరంభాన్ని కన్నుల పండువగా తిలకించే వారు, కౌటుంబిక, స్నేహ, ప్రేమికుల,  విద్యార్థుల, రచయితల, కవుల, సాహితీ కారుల బృందాలు ఒక్క చోట కలిసి పండుగ చేసుకునే పుస్తక మేళాకు వెళ్ళిన వారికి మరచిపోలేని అనుభూతులను మిగులుస్తుంది అనేది నూటికి నూరు పాళ్ళు నిజం.

 రామ కిష్టయ్య సంగన భట్ల…
   9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page