ఫార్మాసిటీపై కేసీఆర్‌ ‌ముందు చూపు

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 13  : ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ ‌పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజ్కెన్‌ ‌చేశారని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్‌ ‌రెడ్డి అరెస్ట్ అం‌శం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌ప్రెస్‌ ‌మీట్‌ ‌నిర్వహించారు. ఫార్మా స్యూటికల్స్, ‌ల్కెఫ్‌ ‌సైన్సెన్స్ ‌రంగంలో మన హైదరాబాద్‌ ‌లో ఐడీపీఎల్‌ను అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.

ఐడీపీఎల్‌ ‌సంస్థ ఎంతో మందికి గొప్ప వాళ్లను తయారు చేసింది. రెడ్డి ల్యాబ్‌ ఓనర్‌ ‌సహా చాలా మంది ఐడీపీఎల్‌ ‌నుంచి వచ్చారు. 40 శాతం భారత దేశంలో బల్క్ ‌డ్రగ్స్ ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతుందని గర్వంగా చెబుతున్నా. కరోనా సమయంలో పారాసిటామల్‌ ‌టాబ్లెట్స్ ‌కావాలని అమెరికా అధ్యక్షుడు కూడా అడిగారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. హైదరాబాద్‌ ‌ఫార్మా స్యూటికల్‌ ‌రంగంలో లీడర్‌గా తయారైంది. దాన్ని మరింత పెంచాలని కేసీఆర్‌ ‌నిర్ణయించారు. అదే విధంగా తెలంగాణను ఫార్మా రంగంలో రారాజు చేసేందుకు కేసీఆర్‌ ఎం‌తో ముందుచూపుతో ఫార్మాసిటీ ప్లాన్‌ ‌చేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మనం పంచాయితీలు పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాలని కేసీఆర్‌ ‌మాకు చెప్పారని కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page