అమృత్‌ ‌టెండర్లపై వొదిలిపెట్టేది లేదు

  • ప్రాజెక్టుల టెండర్ల పేరుతో కుట్రలకు తెర
  • ముడుపులు వొచ్చే పనులపైనే సీఎం రేవంత్‌ ‌దృష్టి
  • బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కెటిఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే భారీగా ముడుపులు వొచ్చే కార్యక్రమాలపైన దృష్టి పెట్టారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అమృత్‌ ‌టెండర్లపై మరోమారు కేటీఆర్‌ ‌విమర్శలు చేశారు.ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.మౌలిక వసతుల ప్రాజెక్టుల టెండర్ల పేరుతో కుట్రకు తెర లేపారని అన్నారు. . అధికారంలోకి వచ్చిన ఒకటి రెండు నెలల్లోనే తాను గతంలో బాధ్యతలు నిర్వహించిన మున్సిపల్‌ ‌శాఖలో సీఎం రేవంత్‌ ‌వివిధ పనులకు టెండర్లు పిలిచారని అన్నారు.26 పురపాలక పట్టణాల్లో తాగునీటి ప్రాజెక్టులు సీవరేజ్‌ ‌పనులకు సుమారు 9000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారని తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన టెండర్ల గడువు  ప్రక్రియ పూర్తయిందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

ఈ టెండర్లలో సీఎం రేవంత్‌కు సంబంధించిన కంపెనీలను దొడ్డిదారిన ప్రవేశపెట్టి పనులు అప్పగించారు.అందుకే ఈ మొత్తం వ్యవహారానికి సంంధించిన సమాచారాన్ని ప్రభుత్వం ఏ వెబ్‌సైట్లోనూ ఉంచలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పనుల టెండరింగ్‌ ప్రక్రియ పూర్తి అయిన ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఒక్క పత్రిక ప్రకటన కూడా రాలేదు. ఏయే ప్రాంతాల్లో పనులను పిలిచారు. ఎక్కడ ఏ ఏ కంపెనీలకు టెండర్లు దక్కాయి. టెండర్‌ ‌పనుల విలువ వంటి ఏ సమాచారాన్ని కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. అయితే టెండర్లు దక్కించుకున్న ఇండియన్‌ ‌హ్యూమ్‌ ‌పైప్‌ ‌కంపెనీ స్టాక్‌ ‌లిస్టెడ్‌ ‌కంపెనీ కావడంతో… వారికి దక్కిన టెండర్ల తాలూకు సమాచారాన్ని సెబీకి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ టెండర్ల స్కామ్‌ ‌బయటకు వొచ్చింది.

ఈ కంపెనీ సెబీకి ఇచ్చిన సమాచారం ప్రకారం రూ.1137 కోట్ల టెండర్లను సంస్థ దక్కించుకుంది అని కేటీఆర్‌ ‌సంచలన ఆరోపణలు చేశారు.ఈ టెండర్లలో 80 శాతం పనులను మరో రెండు కంపెనీలకు జాయింట్‌ ‌వెంచర్‌ ‌రూపంలో ఇస్తున్నట్లు తెలిపింది.ఈ రెండు కంపెనీల్లో ఒక కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి స్వయానా బావమరిది సూదిని సృజన్‌ ‌రెడ్డి సంస్థ అయిన శోధా కన్స్‌స్ట్రక్షన్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ అనే ఈ కంపెనీకి ఈ జాయింట్‌ ‌వెంచర్‌లో భాగస్వామ్యం ఉంది. ఈ కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకపోవడంతో నేరుగా టెండర్లలో పాల్గొనలేదు.ఈ ఇండియన్‌ ‌హ్యూమ్‌ ‌పైప్‌ ‌కంపెనీపైన ఒత్తిడి తీసుకువొచ్చి టెండర్లు వేయించి అందులో 80 పనులను సీఎం ఆయన బినా కంపెనీలకు అప్పగించారు. . ఈ శోధా కన్స్‌స్ట్రక్షన్‌ ‌కంపెనీకి ఆర్థిక సామర్థ్యం కూడా లేదు.

ఈ కంపెనీ రెవెన్యూ ఏడాదికి కేవలం రూ.71 కోట్లు మాత్రమే, రూ.2 ట్లు మాత్రమే లాభం కలిగిన ఈ కంపెనీ ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు ను ఎలా పూర్తి చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు లేకపోవడంతో నేరుగా టెండర్లలో పాల్గొనని ఈ కంపెనీ దొడ్డిదారిన అవే పనులను చేపట్టడం సరికాదని కేటీఆర్‌ ‌తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కుటుంబ సభ్యులకు వందల కోట్ల రూపాయల టెండర్‌ను కట్టబెట్టడం ముమ్మాటికి ప్రివెన్షన్‌ ఆఫ్‌ ‌కరప్షన్‌ ‌చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.

దీంతోపాటు తమ కుటుంబ సభ్యులకు అనుచితమైన ఆర్థికలబ్దిని కలిగించేందుకు తమ పదవిని అడ్డు పెట్టుకోవడం అనేది ఆఫీస్‌ ఆఫ్‌ ‌ప్రాఫిట్‌ ‌కింద కూడా నేరం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారాలను అమృత్‌ ‌టెండర్ల స్కాంను సెంట్రల్‌ ‌విజిలెన్స్ ‌కమిషన్‌ ‌దృష్టికి తీసుకెళ్తాం. అయితే సుమారు 9 వేల కోట్ల ఈ అమృత్‌ ‌టెండర్ల విషయంలో రేవంత్‌ ‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన బినామీ కంపెనీలతో చాలా కంపెనీలు సబ్‌ ‌కాంట్రాక్టులు తీసుకున్నాయి. ఇది కేవలం అందుబాటులోకి వచ్చిన సమాచారం మాత్రమే. ఈ వ్యవహారంలో జరిగిన వందల కోట్ల అవినీతి తాలూకు ఒక్క ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ టెండర్ల తాలూకు మొత్తం వివరాలను బయటపెట్టి ఆ టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page