అం‌తర్జాతీయస్థాయిలో మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్

ఎనిమిది నెలల్లోనే ప్రారంభించేందుకు చర్యలు
కొత్తగూడెం, రామగుండంలోనూ విమానాశ్రయాలు..
హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి అభివృద్ధి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి  అన్నారు. సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌కు ప్రతిబంధకంగా  మారిన 150 కిలోమీటర్ల జీఎమ్మార్‌ ‌నిబంధనను ఉపసంహరించుకునేందుకు అనేక సమావేశాలు నిర్వహించి ఒప్పించినట్టు మంత్రి తెలిపారు. ఈ నెల 6న ఏవియేషన్‌, ‌రెవెన్యూ అధికారులతో సమావేశమై ఎయిర్‌ ‌పోర్ట్ ‌కు కావాల్సిన.. 280.30 ఎకరాల భూమి లో 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి ఉన్నందున.. ఈ భూసేకరణపై అంచనాలు రూపొందించి కేబినెట్‌ ‌లో ఆమోదం పొందేలా చేశామని తెలిపారు.  తద్వారా రూ.205 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మీడియాకు తెలిపారు.

వరంగల్‌ ‌జిల్లా మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌గురించి దశాబ్ధాలుగా వింటున్నామని, బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సైతం అదిగో  ఇదిగో ఎయిర్‌ ‌పోర్ట్ అం‌టూ ఊరించిందని కానీ ఒక్క ఇటుక వెయ్యలేదని ఆయన ఆరోపించారు. అలాంటి ఎయిర్‌ ‌పోర్ట్ ‌ను రాబోయే 8 నెలల కాలంలో ప్రారంభం చేయబోతున్నామని ఆయన చెప్పారు. మొదటి దశలో మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌ను స్మాల్‌ ఎయిర్‌ ‌క్రాఫ్టస్ ‌రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారు చేశామని, ఎయిర్‌ ‌పోర్ట్ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌చేసేందుకు 8 నెలల పూర్తవుతుందని చెప్పారు. రెండవ దశలో రోజంతా ఇంటర్నేషనల్‌ ‌విమానాలు (పెద్ద విమానాల-ఏ320, బి737), కార్గో విమానాల ఆపరేషన్‌ ‌చేయడానికి రానున్న సంవత్సరం 6 నెలల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్‌ ‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా నుంచి ఆదేశాలు వొచ్చాయని ఆయన ప్రకటించారు.

ఎయిర్‌ ‌పోర్ట్ ‌విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లు విడుదల చేస్తూ ఇచ్చిన జీఓ ను మీడియా ప్రతినిధులకు అందించారు. ఈ ఎయిర్‌ ‌పోర్ట్ ‌ను భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తిరుపతి, విజయవాడ, దిల్లీ, ముంబాయి, బెంగళూరు) ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు పెద్ద విమానాలను నడిపే విధంగా ఎయిర్‌ ‌పోర్ట్ ‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం, రామగుండంలోనూ ఎయిర్‌ ‌పోర్టులు
రాబోయే రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్‌ ‌ఫీల్డ్ ఎయిర్‌ ‌పోర్టులకు వీలైనంత త్వరగా అనుమతులు సాధించి నిర్మాణం చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడుతో చర్చించామని వారు కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పదేండ్లలో సాధించని ఎయిర్‌ ‌పోర్టులను నాలుగేండ్లలో సాధించి చూపిస్తామని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి అభివృద్ధి
హైదరాబాద్‌ %-% ‌విజయవాడ (ఎన్‌ ‌హెచ్‌-65) ‌విస్తరణ పనులు చేపట్టాలని తాను అడిగిన వెంటనే కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ 6 వరుసల ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవేను మంజూరు చేశారని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన డీపీఆర్‌ ‌పూర్తయ్యే స్టేజీలో ఉందని.. డీపిఆర్‌ ‌పూర్తయిన వెంటనే జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో హైదరాబాద్‌ %-% ‌విజయవాడ మధ్య ప్రయాణం మరింత మెరుగవుతుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని తద్వారా విమానాల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్డు మార్గంలో వెళ్తారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ %-% ‌భూపాలపట్నం ఎన్‌ ‌హెచ్‌ 163 ‌పరిధిలో నిర్మిస్తున్న ఉప్పల్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులను ఆగష్టు 2018లో శంకుస్థాపన చేశారని..

గత ప్రభుత్వంలో కేవలం 30 % పనులను మాత్రమే పూర్తిచేశారని.. హైదరాబాద్‌ అభివృద్ధి చేసినమని చెప్పుకు తిరిగే బీఆర్‌ఎస్‌ ‌నాయకులు నాలుగున్నరేండ్లలో ఉప్పల్‌ ‌ఫ్లైఓవర్‌ ‌ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వర్షాలు పడి రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది చనిపోవడం, క్షతగాత్రులై ఇబ్బందులు పడుతుంటే నాలుగున్నరేండ్లు ఏం చేశారని ఆయన నిలదీశారు. మేం వొచ్చిన తర్వాత పనులు చేయని సంస్థను ఫోర్‌ ‌క్లోజ్‌ ‌చేసి కొత్తగా పనులు ప్రారంభించామని ఇప్పటికే పది నెలల్లోనే 50% పనులను పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఉప్పల్‌ ‌చౌరస్తా నుంచి సీపీఆర్‌ఐ (‌సెంట్రల్‌ ‌పవర్‌ ‌రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌) ‌నారపల్లి వరకు దాదాపు 5 కిలోమీటర్లు ఉన్న ఫ్లైఓర్‌ ‌నిర్మాణంలో మేడిపల్లి నుంచి సీపీఆర్‌ ఐ ‌వరకు ఫ్లైఓవర్‌ ‌నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని ఆయన చెప్పారు. ఉప్పల్‌ ‌నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్‌ ‌పూర్తి కావడానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుంది చెప్పారు. ఇప్పటివరకు ఫ్లైఓవర్‌ ‌క్రింద 4 వరుసల రహదారిని 2 కిలోమీటర్ల మేర రోడ్డు వేసి ప్రజలను ఇబ్బందుల నుంచి దూరం చేశామని చెప్పారు. ఇంకా బీటీ చేయాల్సి ఉందని. వొచ్చే మార్చి నెలకల్లా సర్వీస్‌ ‌రోడ్లను పూర్తి చేస్తామన్నారు.

శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్‌ ‌కారిడార్‌ ‌రోడ్డు
శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్‌ ‌కారిడార్‌ ‌రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.  కేంద్రం ఆమోదం తెలిపితే అద్భుతమైన జాతీయ రహదారి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వొస్తుందని ఆయన తెలిపారు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌ప్రయాణించిన రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ (‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు) ను 2017-18 లో ప్రారంభించారని, ఇప్పటిదాక ఒక్క పని కూడా మొదలు కాలేదని.. హైదరాబాద్‌ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి సూపర్‌ ‌గేమ్‌ ‌ఛేంజర్‌ ‌లాంటి ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ను నిర్లక్ష్యం  చేసినవారు రెండు బ్రిడ్జులు కట్టి మేమే హైదరాబాద్‌ ‌నిర్మాతలమని చెప్పుకు తిరిగడం వారికే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌రోడ్డు నిర్మాణం మొదట కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారు. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం.. పూర్తిస్థాయిలో క్లారిటీ, కమిట్‌ ‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో పనులు ఆలస్యం జరిగితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం జరుగుతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం స్వయంగా నిర్మించాలనుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ రోడ్డును 6/8 లేన్స్ ‌లో ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవే తరహాలో (దిల్లీ %-% ముంబాయి ఎక్స్ ‌ప్రెస్‌ ‌వే, ముంబయి-నాగపూర్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌వే, చెన్నై-కన్యాకుమారి ఎక్స్ ‌ప్రెస్‌ ‌వే, గుజరాత్‌ ‌స్టేట్‌ ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు) నిర్మించిన ప్రమాణాలతో ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం నిర్మించిందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ ‌సిటీకి, ఎయిర్‌ ‌పోర్ట్ ‌కు కనెక్టివిటీ కల్పిస్తుంది.

దీంతో ఆయా ప్రాంతాలు సాఫ్ట్ ‌వేర్‌, ‌హార్డ్ ‌వేర్‌, ‌లాజిస్టిక్‌, ‌మ్యాన్‌ ‌ఫ్యాక్చరింగ్‌ ఇం‌డస్ట్రీస్‌, ‌రియల్‌ ఎస్టేట్‌ ‌రంగాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వొచ్చే నెలలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. .. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు దక్షిణ భాగం అలైన్‌ ‌మెంట్‌ అధ్యయనం, ప్రతిపాదించడం కోసం స్పెషల్‌ ‌ఛీఫ్‌ ‌సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక ఆఫీసర్స్ ‌కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ మొదటి సమావేశం ఇప్పటికే పూర్తయ్యిందని, రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు ప్రాజెక్ట్ ఇం‌ప్లిమెంటేషన్‌ ‌యూనిట్‌ ఏర్పాటు చేశామని దీనికి ప్రాజెక్ట్ ‌డైరెక్టర్‌ ‌గా ఆర్‌ అం‌డ్‌ ‌బీ స్పెషల్‌ ‌సెక్రెటరీ దాసరి హరిచందనను నియమించినట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వం రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు దక్షిణ భాగ నిర్మాణానికి, డీపీఆర్‌ ‌ప్రిపరేషన్‌, ‌కోసం టెండర్లు పిలవడానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందులో టెక్నికల్‌ అడ్వైజరీ, ఫైనాన్షియల్‌ అడ్వైజరీలు ఉంటారని మంత్రి తెలిపారు. ఎంపిక చేసిన డీపీఆర్‌ ‌కన్సల్టెంట్స్ ‌ఫీల్డ్ ‌సర్వే చేసి అలైన్‌ ‌మెంట్‌ ‌ను ప్రతిపాదిస్తారు.. ఇందులో ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఎంత ఎత్తులో రోడ్డు నిర్మాణం చేయాలి, ఎంత ఫారెస్ట్ ‌భూములు ఉన్నాయి.

ఎంతమంది రైతుల నుంచి భూసేకరణ చేయాలి వంటి అంశాలను కులంకుషంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తారని తెలిపిన మంత్రి.. ఫైనాన్సియల్‌ అడ్వైజర్‌ ‌రోడ్డు నిర్మాణానికి కావల్సిన నిధులను సమకూర్చుకోవడానికి వరల్డ్ ‌బ్యాంకు, జైకా, ఏడిబీ (ఎషియన్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌బ్యాంకు) మొదలైన ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం ఇప్పటి వరకు 94% భూసేకరణ పూర్తి చేశామని.. వాస్తవానికి 80% భూసేకరణ పూర్తయితే టెండర్లు పిలవవచ్చు కానీ.. ఎన్‌ ‌హెచ్‌ ఏఐ ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు. భూసేకరణకు సంబంధించిన పరిహారం ఇంకా ఫైనల్‌ ‌చేయలేదని ఆయన తెలిపారు. భూసేకరణ పరిహారం విషయంలో రైతులకు నష్టం జరగకుండా.. మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా ప్రయత్నిస్తున్నాం.. రైతులు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో ఎన్‌హెచ్‌ ఏఐ ‌కి పూర్తి సమాచారం, సహకారం అందిస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణం ఇక వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు ఉత్తర భాగం కొరకు 1895 హెక్టార్ల భూమి సేకరణ చేయవలసి ఉండగా.. ఇప్పటిదాక 1862 హెక్టార్ల భూమి కొరకు 3 (డి) నోటిఫికేషన్‌ ‌జారీ చేయడం జరిగింది. 1320 హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డుల ప్రిపరేషన్‌ ‌జరిగింది. మరియు 427 హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతున్నది. 94 హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసుల్లో ఉంది. ఇవన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎన్‌హెచ్‌ ఏఐ ‌కి అప్పగిస్తమని మంత్రి తెలిపారు.

మాది అభివృద్ధి %-% వాళ్లది ఫక్తూ రాజకీయం
మేం తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలో అని ప్రణాళికలు వేసుకొని ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం వరంగల్‌ ‌జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దాదాపు 4 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. కలెక్టర్‌ ‌పై దాడి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్న కు బదులిస్తూ.. రైతుల ముసుగులో బీఆర్‌ఎస్‌ ‌లీడర్లు, కార్యకర్తలు కలెక్టర్‌ ‌పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. నేను ఎమ్మెల్యే – ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్‌ ‌నన్ను అనేకసార్లు హౌస్‌ అరెస్టు చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ప్రజలు పదవులు ఇచ్చింది దిల్లీలో ఉండి రాష్ట్రానికి మేలు చేయడానికా? గల్లీలో ఉండదానికా? అని ఆయన ప్రశ్నించారు. కిషన్‌ ‌రెడ్డికి దమ్ముంటే నల్గొండలో మూడు నెలలు పడుకొని కాళ్ళు చేతులు వంకలు కాకుండా హైదరాబాద్‌ ‌వాస్తరా అని ఛాలెంజ్‌ ‌చేశారు? కిషన్‌ ‌రెడ్డికి దిల్లీలో దోమల భాధకు తట్టుకోలేక హైదరాబాద్‌ ‌లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బాషీర్‌ ‌భాగ్‌ ‌లో రైతుల పై చంద్రబాబుతో కలిసి కేసీఆర్‌ ‌కాల్పులు జరిపించి ఇప్పుడు రైతులపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన ఆరోపించారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌ ‌మూసీ శుద్ధీకరణ వద్దు ప్రకటన చేయగలరా అని ప్రశ్నించారు.

తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి :
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి పరిశీలించారు. డిసెంబర్‌ ‌మొదటి ఫస్ట్ ‌వీక్‌ ‌లో పనులు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. లక్షలమంది సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కారిస్తామని చెప్పిన మంత్రి తెలంగాణ ప్రజల బాగుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. వారి ఆశీర్వాదం ఉంటే ఏ పక్షం కాంగ్రెస్‌ ‌పార్టీ ని ఏం చేయలేవని వచ్చే ఇరవై ఏండ్లు కాంగ్రెస్‌ ‌పార్టీదేనని తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page