వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి!
బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగు వేయడమే అందుకు ప్రధాన కారణం. వారు ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి అలసత్వం మూలంగా దేశంలో మహిళలు, బాలికలపై హింస అంతకంతకు పెరిగిపోతోంది. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘భారత్ లో మహిళలు-పురుషుల పరిస్థితి-2023’ నివేదిక ప్రకారం మహిళలపై జరిగిన దారుణాలపై విచారణకు వచ్చిన ఉదంతాల్లో కేవలం 2 శాతం లోపు కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఇలా అనేక రకాలుగా స్త్రీలపై జరిగే దాడులు, అత్యాచారాలు, బలవంతపు వివాహలు, సైబర్ వేధింపులు, అక్రమ రవాణా, దాష్టీకాలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక పరిస్థితులు వారి ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా మారుతుందని నివేదిక వివరించింది. దాన్ని అంతం చేయడం ద్వారానే అతివల సాధికారికతకు అడ్డంకులు తొలగుతాయని ఆ నివేదిక పేర్కొంది.
ఈ ఘటనల్లో బాధితుల్లో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల లోపు మహిళలలే అధికంగా ఉండడం, బాధితుల్లో పనిచేసే వారి ఎక్కువమంది పై ఇలాంటి ఘటనలు జరిగుతున్నాయి. ఇంటా, బయటా పనిచేసే చోటుకు వెళ్తున్నప్పుడు అఘాయిత్యాలకు బలవుతున్నారు. రాత్రిపూట పని వేళలో, పనిచేసే ప్రదేశాలు కూడా అత్యాచారానికి కారణమవుతున్నాయి. హత్యాచార నిరోధానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఘటనలు జరగడం మాత్రం ఆగడం లేదు. ఘటనల్లో చాలావరకు, ఎక్కువగా వెలుగుచూడడం లేదు. తమపై జరిగిన హింసాత్మక ఘటనలు బయటపెట్టడం తమకు కలంకంగా, అవమానంగా మారుతుందనే భయాందోళనతో చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. భారతదేశం ప్రగతి పథంలో ఆర్థిక శక్తిగా దూసుకుపోతుందని గొప్పలు చెప్పకున్నా..! పాలకులారా ఆర్థిక కార్యకలాపాల్లో అన్ని రంగాల్లో, విభాగాల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి.
అది సాధ్యపడాలంటే? పని ప్రదేశాల్లో సురక్షితం కావాలి. కానీ అన్ని చోట్ల విపరీతమవుతున్న వేధింపులు, మహిళా అభ్యున్నతికి ఆటంకంగా నిలుస్తున్నాయి. సమాజాన్ని వెనక్కి నడిపించే ఇటువంటి వాటిని అరికట్టాలంటే? పని ప్రదేశాల్లో ఇంటా, బయట లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. ఫాస్ట్ ట్రాక్లో కేసులను సత్వరం విచారణ జరిపి దోషులను కఠినమైన శిక్షలు విదించాలి. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దేశానికి తల వంపు తెస్తున్న ఈ హత్యాచార విష సంస్కృతిని రూపుమాపినప్పుడే ఈ దేశం బాగుంటుంది. మహిళలు ఆగ్రహిస్తే ఈ సృష్టికి.. మానవ జాతికి పుట్ట గతులుండవు.
-ఎం.
-ఎం.