మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్టు

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌దుమ్ముగూడెం మండలం సీతానగరంలో దుమ్ముగూడెం పోలీసులు మరియు సిఆర్‌•ఎఫ్‌ 141 ‌బెటాలియన్‌ ‌సిబ్బంది మరియు స్పెషల్‌ ‌పార్టీ పోలీసులు కలిసి సంయుక్తంగా  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో ప్రయాణిస్తున్న  మావోయిస్టు  ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రం పామేడ్‌ ఏరియా కమిటీకి అనుబ ంధంగా పనిచేస్తున్న క్రాంతికారి ఆదివాసీ మహిళ సంఘానికి చెందిన అజ్ఞాతదళ సభ్యురాలిని అరెస్టు చేయడం జరిగిందని భద్రాచలం సబ్‌డివిజన్‌ ‌డిఎస్పీ తెలిపారు. వివరాల్లోకి వెళితే  ఓయెమ్‌ ‌నందే అలియాస్‌ ‌సమ్మక్క ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో బీజాపూర్‌ ‌జిల్లా బాసగూడ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని కొత్త గూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి నట్లు తెలిపారు.

అరెస్టు చేసిన సమ్మక్క 1999లో తన 16 వ యేట నుండి 2002 వరకు  మావోయిస్టు పార్టీకి చెందిన బాస గూడ ఏరియా బాలల సంఘంలో సభ్యు రాలిగా పనిచేసినట్లు తెలిపారు.అనంతరం 2002వ సంవత్సరం నుండి 2018 వరకు ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని పామేడ్‌ ఏరియాలో  మావోయిస్టు పార్టీకి అనుబం ధంగా పని చేస్తున్న క్రాంతికారి ఆదివాసి మహిళ సంఘం లో సభ్యురాలుగా, 2018 నుండి పనిచే స్తున్నట్లు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ మావోయిస్టు  అగ్రనాయకుల ఆదే శాల ప్రకారం తన తోటి దళ సభ్యులతో పామేడ్‌ ఏరియాలోని ఆదివాసి గ్రామాల్లో సంచరిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ, మావో యిస్టు కార్యక్రమాలను నిర్వహించడం,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీతో కలిసి తిరుగుబాటు చేసే విధంగా అమాయక ఆదివాసి ప్రజలను ప్రేరేపించడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ఈమె వద్దనుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన కరపత్రాలు,సాహిత్యం స్వా ధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఈమెను  చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి,జ్యూడిషియల్‌ ‌రిమాండ్‌ ‌నిమిత్తం జ్కెలుకు తరలించడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page