భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా జిల్లా జాగురుగుండ పొలిస్టేషన్ పరిధిలోని వారపు సంతలో ఘటన చోటు చేసుకున్నట్లు ధ్రువీకరించిన పోలీసులు .. దాడి అనంతరం తప్పించుకున్న మావోయిస్టులకోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.