40‌శాతం డైట్‌ ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీల పెంపు

గురుకుల విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు
గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు
మీడియా సమావేశంలో మంత్రి సీతక్క వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌01: ‌రాష్ట్రంలో  గురుకులాలకు డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీలు పెరిగాయి. 40శాతం మేర పెంచినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్నడు లేని విధంగా హాస్టల్‌, ‌గురుకుల విద్యార్థులకు డైట్‌ ‌కాస్మోటిక్‌ 40‌శాతం పెంచారని గుర్తుచేశారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు 40శాతం చార్జీలను పెంచిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  పెంచిన చార్జీలు అందుకోబోతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విద్యార్థులకు అసలైన దీపావళి అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఇక హాస్టల్‌ ‌విద్యార్థులు అర్థాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. పెంచిన చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లది, హాస్టల్‌ ‌సిబ్బందిది అని తెలిపారు. హాస్టల్‌ ‌విద్యార్థులకు డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌చార్జీలు గ్రీన్‌ ‌ఛానల్‌ ‌ద్వారా చెల్లిస్తామని మంత్రి సీతక్క హామీ  ఇచ్చారు.డైట్‌ ‌చార్జీలు ఏడేళ్లుగా, కాస్మోటిక్‌ ‌చార్జీలు గత 16 సంవత్సరాలుగా పెరగలేదని అన్నారు.

ఏడు సంవత్సరాల క్రితం డైట్‌ ‌చార్జీలు కొంచెం పెంచి.. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రచారం చేసుకుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందని మంత్రి డాక్టర్‌ ‌ధనసరి అనసూయ సీతక్క విమర్శలు చేశారు. విద్యా శాఖకు కేసీఆర్‌ ‌ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్‌ ‌రెడ్డి సీఎంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్‌ ‌రెడ్డి పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. ఏడేళ్లుగా ధరలు విపరీతంగా పెరిగాయని.. అందుకు అనుగుణంగా డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీలు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.

డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీలు పెంచకపోవడంతో పిల్లలు అర్దాకలితో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు కేసీఆర్‌ అధికారంలో ఉండి టాయిలెట్స్ ‌కట్టలేదని..తాగునీరు, మౌలిక వసతులు కల్పించలేదని ధ్వజమెత్తారు. ఈ సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సీతక్క అన్నారు. డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందని వివరించారు.పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌చార్జీలను పెంచిన సీఎం రేవంత్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page