రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా
జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా నిలిచారని, బిజెపితోనే సుస్థిర పాలన సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద జన్మదినం సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టి. యాదీశ్ ఆధ్వర్యంలో ఆదిత్య బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో ఉచిత వైద్యశిబిరం,రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ బీజేవైఎం అధ్యక్షులు సేవెళ్ల మహేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ల వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలనే ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో దేశంపై వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారని, ఇది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.కాగా శిబిరంలో 113 మంది రక్త దానం చేయగ, 230 మంది హెల్త్ చెక్ అప్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. 300 మంది కంటి పరీక్షలు చేసుకున్నారని అన్నారు.
30 మందికి ఉచిత ఆపరేషన్ కు తీసుకెళ్లినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోసు పల్లి ప్రతాప్, పోరెడ్డి అర్జున్ ఈ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కాసాని శ్రీను, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్ రాజ్, మాధవ్ రెడ్డి, ఉటు మహేందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర దిలీప్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బోధ యాదగిరి రెడ్డి, చింతల రాఘవేందర్, గోవర్ధన్ రెడ్డి, బస్వ రఘు గౌడ్, రూపక్, విజేందర్ రెడ్డి, బొర్ర సాయిలు, ఓం ప్రకాష్, స్థానిక కౌన్సిలర్ రాజమోని రాజు, బాకీ విలాస్, జిల్లా నాయకులు ప్రశాంత్, అఖిల్ కుమార్, మాధవ్, హరికృష్ణ, ముత్యాల అనిల్, శశిధర్ రెడ్డి, మహేందర్, వరుణ్, దేవేందర్ నాయక్ పాల్గొన్నారు.