పేదల కన్నీళ్లతో ఆడుకుంటే పతనం తప్పదు

పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలి
హైడ్రా పేరుతో సామాన్యులకు ఇక్కట్లు
బాధితులకు అండగా నిలిచిన ఎంపి ఈటల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌డ్రామాలు ఆడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు చేశారు. పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. ఏళ్లుగా ఉంటున్న వారిని ఎలా ఖాలీ చేయిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు కంటి ద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఆర్థిక మంత్రిగా చెబుతున్నాను… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పుల ఊబిలో రాష్ట్రం కురుకుపోయిందని అన్నారు.పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్‌ ‌ప్రభుత్వానికి పతనం తప్పదని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. హైడ్రాను నియమించిన రోజే ఇది డ్రామా అని చెప్పానని అన్నారు. హైడ్రా అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉంది.. ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కోరారు.

చైతన్యపురి డివిజన్‌ ‌న్యూ మారుతి నగర్‌ ‌మూసీ పరిసర ప్రాంతాల్లో ఈటల రాజేందర్‌ ‌శుక్రవారం పర్యటించి బాధితులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ… పేదలపై కనికరం లేకుండా రేవంత్‌ ‌ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. జొన్నల బండ వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని వాటిని కూడా కూల్చేందుకు రేవంత్‌ ‌ప్రభుత్వం పనులు చేస్తోందని ఈటల రాజేందర్‌ అన్నారు. మూసీని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదు… కానీ ఎన్నడో భూమి కొన్న వారు ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నారని తెలిపారు. లక్షలు పెట్టి కొన్న ఇళ్లకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు ఇస్తామనడ భావ్యంకాదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ ప్రాంతాల్లోకి ఏనాడూ మూసీ నుంచి వరద నీరు రాలేదని తెలిపారు. హైడ్రా పేరుతో రేవంత్‌ ‌ప్రభుత్వం బస్తీ ప్రజలకు కంటి ద కునుకు లేకుండా చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌ ‌మాటలు నమ్మినందుకు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. ఖబడ్దార్‌ ‌రేవంత్‌.. ‌ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై నివేదిక ఇస్తామని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. చట్టాలు, జడ్జీల ద నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. తెలంగాణ రేవంత్‌ ‌జాగిర్‌ ‌కాదని… ప్రజలు వోట్లు వేస్తే సీఎం అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకుని మసలుకోవాలని ఈటల సూచించారు. ప్రజల ద దౌర్జన్యం చేయడం సరికాదని అన్నారు. అవసరమైతే లక్షలాది మందితో రేవంత్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళ్తామని.. తాము చూస్తూ కూర్చోమని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.

One comment

  1. ఇంటి వద్దే , పేపర్ కోసం కూడా నిరీక్షకుండా, ప్రజాతంత్ర వార్తలు చదవడం మాతరంవాళ్ళకి, సులభంగా, సంతోషంగా, ఉన్నది.
    ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page