ఎవరి కోసం మూసీ సుందరీకరణ?

కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్ లో సాబర్మతీ, వారాణసిలో గంగా, దిల్లీలో యమునా నదీ తీరాలలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి వెళ్లారు.

n venugopal
-ఎన్‌ వేణుగోపాల్‌

మూసీ సుందరీకరణ అనే అందమైన పేరుతో, కళ్లు మిరుమిట్లు గొలిపే ఆర్థిక వ్యయం అంచనాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం రాజకీయ వివాదంగా, ఆరోపణల ప్రత్యారోపణల దూషణల ప్రహసనంగా మారుతున్నట్టుంది. ఖాలీ చేయించదలచినవారికి నోటీసులు ఇవ్వడం, సమాధానం కోసం సమయం ఇవ్వడం, తప్పనిసరిగా ఖాలీ చేయించవలసి వస్తే చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వడం, వీలయినంత తక్కువ దూరంలో ఇప్పుడున్న జీవనస్థితికి మించిన పునరావాసం కల్పించడం, నిర్వాసిత, పునరావాస పథకాల మీద బహిరంగ, పారదర్శక, విస్తృత చర్చకు అవకాశం కల్పించడం వంటి నాగరిక, ప్రజాస్వామిక, చట్టబద్ధ పద్ధతులను వేటినీ ప్రభుత్వం పాటించదలచుకున్నట్టు కనబడడం లేదు. ఇది మూసీ సుందరీకరణ పథకంగా కన్న ఎక్కువగా చిక్కుముడి పథకంగా, మహా అవినీతి కుంభకోణంగా మిగిలిపోయేట్టు కనబడుతున్నది. ప్రత్యేక తెలంగాణ మొదటి దశాబ్దపు భారీ కుంభకోణమైన కాళేశ్వరంను మించినదిగా ఈ రెండో దశాబ్దపు మూసీ సుందరీకరణ కుంభకోణం చరిత్రలో నిలిచిపోయేట్టు కనబడుతున్నది.

అధికారంలోకి వచ్చిన నెలలోపలే, జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించినప్పుడు దాని వ్యయం రు. 58,000 కోట్లు అన్నారు. ఆరు నెలలు తిరిగే సరికి ఆ వ్యయం రు. 70,000 కోట్లు అన్నారు. ఇప్పుడు రు. 1,50,000 కోట్లు అంటున్నారు. ఈ అంకెలు చూస్తే సరిగ్గా కాళేశ్వరం విషయంలో మొదటి రు. 38,000 కోట్ల పథకం, ఏడాది తిరగకుండా రు. 80,000 కోట్లకు ఎగబాకి, ఏడేళ్ల తర్వాత రు. 1,47,000 కోట్లకు చేరిన సంగతే గుర్తొస్తుంది. వాస్తవంగా చరిత్ర అధ్యయనం చేస్తే మూసీ సుందరీకరణ అనేది ఒక అసాధ్యమైన పథకం. దాని అంచనా వ్యయం లెక్కలు చూస్తుంటే అది కాంట్రాక్టర్ల బొక్కసాలు నింపే పథకం అనిపిస్తున్నది. కాంట్రాక్టర్ల నుంచి వెనక్కి రాజకీయ నాయకులకు ఇబ్బడి ముబ్బడిగా ముడుపులు సంపాదించి పెట్టే పథకం కూడ కావచ్చు. వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా ఉంటున్న ఆవాసాల నుంచి దౌర్జన్యంగా వెళ్లగొట్టే పథకం. ఇంతచేసీ అది నదిని సుందరీకరిస్తుందా అనుమానమే. సుందరీకరణ జరిగినా అది ఎవరి కోసం అనే ప్రశ్న మిగిలే ఉంటుంది.

నదిని నగరానికి కేంద్ర బిందువుగా మార్చి దాని చుట్టూ వినోద, వాణిజ్య, వారసత్వ, ఆవాస కేంద్రాలను నిర్మించడం ఈ కొత్త పథకం లక్ష్యం అని చెప్పుకుంటున్నారు. వీటిలో వాణిజ్యం ఒక్కటే నిజమవుతుందేమో అని అనుమానించక తప్పడం లేదు. ఈ పథకంలో జల నిర్వహణ, ప్రణాళిక, సులభ రవాణా, పునరావాసం, పట్టణ పునరుద్ధరణ అనే ఐదు కీలకాంశాలు ఉంటాయంటున్నారు గాని ఏ ఒక్కటీ సాధ్యం కాదని అనుమానించక తప్పదు. హైదరాబాద్ కు పశ్చిమ దిశలో 100 కి.మీ. ఎగువన అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ ఒకప్పుడు జీవనది. అది హైదరాబాద్ చేరడానికి కొద్ది ముందు దానిలో మరొక ఉపనది ఈసా కలుస్తుంది. ఒకప్పుడు జీవనదిగా ఉండిన ఈ నదికి 1908లో భారీ వరదలు వచ్చాక, భవిష్యత్తు వరద నివారణ చర్యలు సూచించమని అప్పటి ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కోరగా, ఆయన పూనికతో 1920లలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణమయ్యాయి. అందువల్ల నది దిగువన నిరంతర ప్రవాహం ఆగిపోయింది. ఎప్పుడో ఎగువన వర్షాలు ఎక్కువగా పడినప్పుడు, రెండు జలాశయాలు మత్తడి పడినప్పుడు మాత్రమే మూసీ ఒక నది అని జనానికి గుర్తొస్తుంది.

మొదట చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో 1997లో మూసీ సుందరీకరణ కోసం నందనవనం పథకం తలపెట్టారు. కాని నదీ తీరపు మురికివాడల నుంచి ప్రజలను నిర్వాసితులను చేయడం అసాధ్యమైన పనిగా త్వరలోనే తేలిపోయి, ఆ పథకం మొత్తంగానే కనుమరుగయింది. మూసీ తీరంలో తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న పేద, మధ్య తరగతి ప్రజలు, పరీవాహక ప్రాంత గ్రామాల రైతులు మూసీ బచావో ఆందోళన్ అనే ఉద్యమమే ప్రారంభించారు.  1998లో నదీ గర్భంలో 20 అడుగుల కాలువల తవ్వాలనీ, ఇరు పక్కలా ఇరవై మీటర్ల వెడల్పు రహదారులు నిర్మించాలనీ ప్రణాళిక వేశారు. ఆ పని పూర్తిగా జరగకముందే 2000 సంవత్సరంలో మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.

నగరం లోపల మూసీ 56 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. ఈ మార్గమంతా నది ఒకప్పటి వెడల్పు బాగా తగ్గిపోయి, కొన్ని అడుగులో, కొన్ని గజాలో మాత్రమే మిగిలింది. అది కూడా దారి పొడవునా ఉన్న నివాస ప్రాంతాల మురుగు నీటి కాల్వలు వదిలే దుర్గంధ, మలిన పదార్థాలతో నిండిపోయింది. మానవ వ్యర్థ పదార్థాల కన్న ఎక్కువగా, దారి పొడవునా ఉన్న కాలుష్య కారక లోహ, రసాయనిక, మాంస, చర్మ పారిశ్రామిక సంస్థల వ్యర్థాలు కూడ మూసీలో ప్రవహిస్తున్నాయి. అందువల్ల ఎంత కోరిక ఉన్నప్పటికీ మూసీ నది పూర్వ వైభవం సాధించడం అసాధ్యం కావచ్చు. కనీసం మంచి నీటి నదిగా, నిరంతర ప్రవాహంగా, నగరానికి ఒక ఆటవిడుపు స్థలంగా, ఆహ్లాదకారకంగా, దిగువన దాదాపు ఎనబై కి.మీ. ప్రవాహమార్గంలో ఉన్న 90 గ్రామాల ప్రజలకు ఆరోగ్యకరమైన నీరు అందించే నదిగా మార్చడం కష్టసాధ్యం కావచ్చు గాని అసాధ్యమేమీ కాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 1990ల మధ్య నుంచీ కూడా మూసీ నదిని శుభ్రం చేయడం, సుందరీకరించడం, ఆక్రమణలను ఖాలీ చేయించడం, కొత్త ఆక్రమణలు రాకుండా చూడడం లక్ష్యాలుగా కనీసం అరడజను సార్లు ప్రయత్నాలు చేశాయి. ప్రతి ఒక్క ప్రయత్నమూ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు తర్వాత మధ్యలో ఆగిపోయి విఫలమై పోయాయి. గతంలో మూసీ సుందరీకరణ పేరుతో నిర్మించిన సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (వ్యర్థ పదార్థాల ప్రక్షాళణా కేంద్రాలు), కొత్త వంతెనలు మూసీ నది జలాలను, పరిసరాలను ఏమీ మార్చలేకపోయాయి.

Musi River Beautification

మొదట చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో 1997లో మూసీ సుందరీకరణ కోసం నందనవనం పథకం తలపెట్టారు. కాని నదీ తీరపు మురికివాడల నుంచి ప్రజలను నిర్వాసితులను చేయడం అసాధ్యమైన పనిగా త్వరలోనే తేలిపోయి, ఆ పథకం మొత్తంగానే కనుమరుగయింది. మూసీ తీరంలో తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న పేద, మధ్య తరగతి ప్రజలు, పరీవాహక ప్రాంత గ్రామాల రైతులు మూసీ బచావో ఆందోళన్ అనే ఉద్యమమే ప్రారంభించారు. 1998లో నదీ గర్భంలో 20 అడుగుల కాలువల తవ్వాలనీ, ఇరు పక్కలా ఇరవై మీటర్ల వెడల్పు రహదారులు నిర్మించాలనీ ప్రణాళిక వేశారు. ఆ పని పూర్తిగా జరగకముందే 2000 సంవత్సరంలో మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.

మళ్లీ 2005లో వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ కార్యక్రమం ప్రారంభమైది. మూసీలోకి కలుషిత పదార్థాలు చేరకుండా అడ్డుకోవాలని పథకం రచించారు గాని అది కూడా ఆగిపోయింది. 2006లో మూసీ సుందరీకరణలో భాగంగా ఉప్పల్ కలాన్ లో 700 ఎకరాల భూమి సేకరించి, సేవ్ మూసీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. 2009లో మూసీ గర్భంలో రబ్బర్ ఆనకట్టలు నిర్మించే పథకం రచించారు. 2010లో మాస్టర్ ప్లాన్ రచించారు. 

మళ్లీ 2005లో వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ కార్యక్రమం ప్రారంభమైది. మూసీలోకి కలుషిత పదార్థాలు చేరకుండా అడ్డుకోవాలని పథకం రచించారు గాని అది కూడా ఆగిపోయింది. 2006లో మూసీ సుందరీకరణలో భాగంగా ఉప్పల్ కలాన్ లో 700 ఎకరాల భూమి సేకరించి, సేవ్ మూసీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. 2009లో మూసీ గర్భంలో రబ్బర్ ఆనకట్టలు నిర్మించే పథకం రచించారు. 2010లో మాస్టర్ ప్లాన్ రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2021లో స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ రచించారు. మరొకవైపు 2022లో జి.ఓ. 111 రద్దు చేశారు. అసలు మూసీ సుందరీకరణ కోసం ఏడు సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు మూసీ సుందరీకరణ వ్యయం రు. 8,000 కోట్లు అని అంచనా వేశారు. ఆ అంకె మొన్న జనవరిలో ఆరు రెట్లు పెరిగి, ఇప్పుడు పదహారు రేట్లు పెరిగిందన్నమాట. అప్పుడూ పని జరిగింది లేదు, ఇప్పుడూ పని జరగబోయేది లేదు.

కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్ లో సాబర్మతీ, వారాణసిలో గంగా, దిల్లీలో యమునా నదీ తీరాలలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి వెళ్లారు. కాని ఈ పథకం ఎంత సంక్లిష్టమైనదీ, బృహత్తరమైనదీ అంటే దీన్ని సాధించడానికి అటువంటి తాత్కాలిక గడువులూ పని చెయ్యవు, లక్షల కోట్ల రూపాయల నిధులూ పని చెయ్యవు.

 

నగరంలో నది పొడవు 56 కి.మీ.లో కనీసం సగం దూరం, దాదాపు 25-30 కి.మీ. విస్తృతంగా జనావాసాలు ఉన్నాయి. అంటే కొన్ని వేల ఇళ్లను తొలగించవలసి వస్తుంది. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తానని చెపుతున్న ఇళ్లే పదహారు వేలు అంటే దాదాపు లక్ష మంది నిర్వాసితులు కావచ్చు. ప్రభుత్వం చెప్పే అంకెలు కచ్చితంగా వాస్తవ అంకెల కన్న చాలా చాలా తక్కువ కావచ్చు. నదీ గర్భంలోనూ, రెండు వైపులా నదీ తీరాలలోనూ ఎంత భూమి అన్యాక్రాంతమయింది, ఆక్రమణలకు గురయింది అని లెక్కలు తేల్చడంలో చాలా సంక్లిష్టత ఉంది. అది సులభంగా తేల్చదగిన లెక్క కాదు. మూసీ గర్భాన్నీ, నదీ తీరాలను ప్రభుత్వం కూడా ఆక్రమించి భవనాలు నిర్మించింది. కచ్చితంగా ప్రైవేట్ భూవ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను ఆక్రమించి భవనాలు కట్టారు, లేఔట్లు వేశారు. ఆ లేఔట్లలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు బ్యాంకు రుణాలు కూడా తీసుకుని మరీ ఇళ్లు సంపాదించుకుని ఉంటారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2021లో స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ రచించారు. మరొకవైపు 2022లో జి.ఓ. 111 రద్దు చేశారు. అసలు మూసీ సుందరీకరణ కోసం ఏడు సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు మూసీ సుందరీకరణ వ్యయం రు. 8,000 కోట్లు అని అంచనా వేశారు. ఆ అంకె మొన్న జనవరిలో ఆరు రెట్లు పెరిగి, ఇప్పుడు పదహారు రేట్లు పెరిగిందన్నమాట. 

ఇవి కాక బతుకుతెరువు కోసం నగరానికి వచ్చి, ఏ రాజకీయ నాయకుడి ప్రాపకంతోనో, ఏ పెత్తందారు ప్రాపకంతోనో, మూసీ తీరంలో ఇరవై ముప్పై చదరపు గజాల స్థలంలో రేకులతోనో, ప్లాస్టిక్ షీట్లతోనో, పక్క గోడలతోనో చిన్న చిన్న గూళ్లు నిర్మించుకున్న జనాలు ఉంటారు. ఈ ఇళ్లలో యజమానులూ ఉండవచ్చు, అద్దెకు ఉన్నవారూ ఉండవచ్చు. కనీసం మూడు తరాలుగా నివసిస్తున్నవారు కూడా ఉండవచ్చు. రెండు సంవత్సరాల కింద రాసిన ఒక మూసీ పునరుద్ధరణ పరిశోధనా పత్రం ప్రకారం మూసీ తీరంలో చాదర్ ఘాట్ దర్వాజా మురికివాడ, మూసా నగర్ 70 సంవత్సరాలుగా, జుమెరాత్ బజార్, కాంగార్ నగర్ 55 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నాయి. ఈ నివాస ప్రాంతాలన్నిటికీ మునిసిపల్ అధికారులు ఇళ్ల నంబర్లు ఇచ్చారు, పన్నులు వసూలు చేస్తున్నారు, మంచి నీటి, మురుగు నీటి సౌకర్యాలు కల్పించారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా స్తంభాలు నాటారు, ఇళ్లకు విద్యుత్తు ఇచ్చారు, నెలనెలా బిల్లులు వసూలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలూ ఈ మూసీ తీర “అక్రమ” జనావాసాల వోటర్లకు గాలాలు వేస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా సజావుగా సాగిన ఈ అక్రమాలనూ, ఆ అక్రమాల అసలు బాధ్యులనూ పక్కన పెట్టి, ఇప్పుడు అక్కడ నివాసం ఉంటున్న వారి మీద దౌర్జన్యం ఒక్కటే మూసీ సుందరీకరణ కార్యక్రమం అవుతుందా?

అన్నిటికీ మించి, అనంతగిరి కొండల్లో మూసీ జన్మస్థలంలో అడవిని రాడార్ స్టేషన్ కోసం ధ్వంసం చేసి, జంట జలాశయాలకు నీరందించే ప్రాంతాల పరిరక్షణ కోసం తెచ్చిన జి.వో. 111 రద్దు చేసి, అంటే మూసీలో నీటి చుక్క కూడా ప్రవహించకుండా గొంతు పిసికి, ఇప్పుడు మూసీ సుందరీకరణకు నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు? మూసీని పునరుద్ధరించాలంటే దానిలో ఇప్పుడు ప్రవహిస్తున్న మురుగు నీటినీ, మంచి నీటినీ వేరు చేయాలని, అంటే మూసీలో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలతో నింపకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ, నగరంలోనూ ఎగువనా ఉన్న కాలుష్య కారక పరిశ్రమలన్నిటినీ మూసివేయాలని, నది పొడవునా మరిన్ని ఎస్ టి పి లు నెలకొల్పాలని ఇంతవరకూ జరిగిన పరిశోధనలన్నీ చెప్పాయి. ఆ తర్వాతనే తీరంలో, గర్భంలో ఉన్న జనావాసాల ప్రజలకు చర్చ, సంభాషణ, నచ్చజెప్పడం, రెండు నుంచి ఐదు కి.మీ. లోపల పునరావాసం కల్పించడం అనే పని చేపట్టాలి. సుందరీకరణ అనేది జనం కోసం చేయవలసిన పని. జనాన్ని తొలగించి, మినహాయించి చేయవలసిన పని కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page