‘ఉత్తమ వోటరు అవగాహన’ ప్రచార అవార్డుకు నామినేషన్ల ఆహ్వానం

జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఇలంబర్తి
వోటు హక్కు వినియోగించుకోవడంపై 2024 సంవత్సరంలో వోటర్లకు అవగాహన పెంపొందించి చైతన్య పరచడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి సంబంధించి, భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రకటించింది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌ప్రజాస్వామ్యంలో వోటు విలువ, వోటు హక్కు వినియోగించుకోవడం పై 2024 సంవత్సరంలో వోటర్లకు అవగాహన పెంపొందించి చైతన్య పరచడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి సంబంధించి, భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రకటిం చిందని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఇలంబర్తి తెలిపారు. మీడియా హౌస్‌ల నుండి 2024 సంవత్సరానికి ఉత్తమ వోటరు అవగాహన ప్రచార అవార్డుకు నామినేషన్స్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.  ఈ అవార్డులు నాలుగు విభాగాల్లో ఉన్నాయని, ప్రింట్‌ ‌మీడియా, టెలివిజన్‌, ‌రేడియో, ఆన్‌లైన్‌ ‌సోషల్‌ ‌మీడియాకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. వోటరు హక్కులపై అవగాహన పెంపొందించడం, ఎలక్షన్‌ ‌టెక్నాలజీ అంశాలను ప్రచారం చేయడం వంటి అంశాల్లో ప్రాముఖ్యతను చూపిన మీడియా సంస్థలను గుర్తించడం ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ అవార్డులను జాతీయ వోటర్ల దినోత్సవం సందర్భంగా, 2025 జనవరి 25వ తేదీన అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రచార నాణ్యత, ఖచ్చితత్వం, ప్రజా పరిజ్ఞానం, వోటర్లకు సరైన సమాచారాన్ని అందించడం, ప్రత్యేక కథనాలు, చర్చలు  వంటి  అంశాల ఆధారంగా ఈ అవార్డులను నిర్ణయిస్తారని, ప్రతి విభాగంలో పాల్గొనే సంస్థలు తమ ప్రచారం యొక్క సారాంశం, ప్రచురణ లేదా ప్రసారం యొక్క వార్త ఇతర సంబంధిత ప్రచార కార్యకలాపాలతో సహా నిజ ప్రతులను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్‌ 10,2024 ‌లోగా తమ సిఫార్సును రాజేష్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, అం‌డర్‌ ‌సెక్రటరీ (కమ్యూనికేషన్‌), ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా, నిర్వచన్‌ ‌సదన్‌, అశోక రోడ్‌, ‌న్యూ దిల్లీ…110001 చిరునామాకు పంపాలని పేర్కొన్నారు. ఈమెయిల్‌లో media-division@eci.gov.inకు పంపవచ్చని, హిందీ లేదా ఇంగ్లీష్‌ ‌కాకుండా ఇతర భాషలలో ఉన్నట్లైతే  ఆంగ్ల అనువాదాన్ని కూడా జతపరచాలని తెలిపారు.
ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఈసీఐ) ప్రకటించిన 2024 ఉత్తమ వోటరు  అవగాహన ప్రచార అవార్డుకు గాను  క్రింది చూపిన నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయని తెలిపారు.  ప్రింట్‌ ‌మీడియా, టెలివిజన్‌, ‌రేడియో, ఆన్‌లైన్‌/‌సోషల్‌ ‌మీడియా విభాగాల్లో  అవార్డులు అందిస్తారన్నారు. ప్రతి విభాగంలో ఉన్నత ప్రమాణాలు  తీసుకున్న ప్రసార సమయం, సామర్థ్యం, మరియు ప్రజలపై చూపిన ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ప్రింట్‌ ‌మీడియా ప్రచురించిన వ్యాసాల సంఖ్య, ఆర్టికల్స్ ‌ప్రచురించిన ప్రింట్‌ ఏరియా స్క్వేర్‌ ‌సెంటీమీటర్లు, మరియు పాఠకులలో అవగాహన కల్పించేందుకు చేసిన కార్యక్రమాల సమాచారాన్ని పిడిఎఫ్‌ ‌సాఫ్ట్ ‌కాపీ/వెబ్‌ అ‌డ్రస్‌ ‌లింక్‌/‌ఫుల్‌ ‌సైజ్‌ ‌ఫోటో కాపీ/ న్యూస్‌ ‌పేపర్‌ ‌ప్రింట్‌ ‌కాఫీ/ఆర్టికల్స్ ‌సమర్పించాలని తెలిపారు.
టెలివిజన్‌, ‌రేడియో ఎంట్రిలకు ప్రసారమైన కార్యక్రమం యొక్క వ్యవధి, ఫ్రీక్వెన్సీ, మొత్తం ప్రసార సమయం వివరాలను సీడీ, డీవీడీ, లేదా పెన్‌ ‌డ్రైవ్‌ ‌ద్వారా సమర్పించాలని తెలిపారు. ఆన్‌లైన్‌/‌సోషల్‌ ‌మీడియా పోస్ట్‌లు, బ్లాగ్‌లు, ట్వీట్‌లు, లేదా ఇతర సోషల్‌ ‌మీడియా ప్రచారాల సమీక్షను, మరియు వాటి ప్రభావం వివరాలతో పిడిఎఫ్‌ ‌సాఫ్ట్ ‌కాపీ/వెబ్‌ అ‌డ్రస్‌ ‌లింక్‌/ ఆన్లైన్‌ ‌యాక్టివిటీ వివరాలు సమర్పించాలని సూచించారు. 2024 సంవత్సరం లోనే ప్రసారం, ప్రచురణ లేదా ఆన్‌లైన్‌లో పోస్టు చేయబడాలని ,ఇతర భాషలలో సమర్పించినట్లైతే ఆంగ్ల అనువాదం తప్పనిసరి అని తెలిపారు.
ప్రతి ఎంట్రీ కి సంస్థ పేరు, చిరునామా, టెలిఫోన్‌, ‌ఫ్యాక్స్ ‌నంబర్లు, ఈమెయిల్‌ ,‌తదితర పూర్తి వివరాలతో 10 డిసెంబర్‌ 2024 ‌లోగా పంపాలని పేర్కొన్నారు. ప్రతి ఎంట్రీని ప్రచారం నాణ్యత, సరికొత్త ప్రచార పద్ధతులు, ప్రజలపై సాధించిన ప్రభావం వంటి అంశాల ఆధారంగా ఆమోదిస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page