దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీఏ ప్ర‌భుత్వం వివక్ష

  • గుజ‌రాత్ కు పోటీ ఇస్తున్నాం.. అందుకే మాపై కుట్ర‌
  • మూసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
  • హైదరాబాద్ లో గాంధీ ఐడియాలజీ సెంటర్
  • పటేల్ విగ్రహంలా బాపూ ఘాట్లో గాంధీ విగ్రహం
  • ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జ్వోతి ప్రజ్వలన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగింది, కానీ ఎన్డీయే హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.. కాంగ్రెస్ హయాంలో దేశంలో అభివృద్ధి కోసం భాక్రానంగల్ నుంచి, నాగార్జున సాగర్ వరకు ఎన్నో భారీ ప్రాజెక్టులను కట్టారు. కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావోతో ఎన్నో మార్పులు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టారు.

రాజీవ్ గాంధీ హయాంలో ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు మార్చారు. కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకురావడంతో పాటు టెలికాం రంగంలో మార్పులు తీసుకువచ్చారు. మహాత్మాగాంధీ ఆలోచనల ప్రకారం స్థానిక సంస్థల్లో అధికారాలను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్ర‌భుత్వానిదే.. పీవీ నరసిహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలందించిన గొప్ప వ్యక్తి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన పీవీ నరసింహారావు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ నేతలందరూ ప్రజలందరి మౌలిక అవసరాలు తీర్చే యత్నం చేశారు. తర్వాత 30 ఏళ్లు టెక్నాలజీ, టెలికాం ఇతర రంగాల్లో కాంగ్రెస్, యూపీఏ సేవలందించింది.

కాంగ్రెస్, యూపీఏ హయాంలో ఎన్నో విప్లమాత్మక మార్పులు వొచ్చాయి. నెహు నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ ప్రధానులు ఈ దేశంలో అనేక సంస్కరణలు, విప్లవాలు తీసుకువొచ్చారు. మరి మూడో సారి ప్రధాని అయిన నరేంద్రమోదీ ఈ దేశ ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకొచ్చారు..? ఈయన హయాంలో దేశానికి ఏం సేవలు చేశారు..? ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెపాల‌ని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు పనిచేశారు. కానీ ప్రజలకు మాత్రం ప్రధాని మోదీ పార్టీ ఏం చేయలేదు. రైతులను పట్టించుకోవడం లేదు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిందేంటీ..? ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అనే విభజన తేవడానికి యత్నిస్తున్నారు. గతంలో నార్త్ ఇండియా నుంచి ప్రధాని అయితే, సౌత్ ఇండియా నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించింది.

కానీ ప్రధాని మోదీ హయాంలో ఇలాంటి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. అందుకే దక్షిణాది నుంచి నీలం సంజీవరెడ్డి, అబ్దుల్ కలాం లాంటి వాళ్లు రాష్ట్రపతి అయ్యారు. కానీ ఎన్డీయే హయాంలో కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రధాని మోదీ పార్టీ ప్రయత్నాలు చేసింది కానీ దక్షిణాదికి చేసిందేమీ లేదు. దక్షిణాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది, కానీ ఇప్పుడు ఎన్డీయే మాత్రం దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటోంది. కానీ తిరిగి ఇచ్చింది ఏమీ లేదు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. సౌత్ స్టేట్స్ కు ప్రధాని మోడీ అందించిన సహకారం చాలా తక్కువ అన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి వోట్లు కావాలని ఎలా అడుగుతారు. నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా వాటిలో తిరిగి పొందేది మాత్రం చాలా తక్కువ. కేంద్రానికి మేం ఒక్క రూపాయి పంపిస్తే కేవలం రూ.40 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి వొస్తున్నాయి. అదే యూపీ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే రూ.7, బిహార్ కు రూ.6 వెనక్కి వొస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతూనే ఉంది. ప్రధాని మోదీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావటమే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడానికి కారణం..అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page