ఆత్మహత్మలకు పాల్పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, మానవ సంబంధాలు తగ్గడం, వ్యక్తులలో జీవన నైపుణ్యాలు కొరవడడమే ప్రధాన కారణం. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో చిన్న సమస్యను పరిష్కరించుకోలేక చావే పరిష్కారమని భావిస్తున్నారు.
సహాయం కోరడానికి స్టిగ్మా ఒక ప్రధాన అడ్డంకి
ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వ్యక్తి ఇతరుల సహాయం కొరడానికి స్టీగ్మా ఒక ప్రధాన అడ్డంకిగా ఉంది. వ్యక్తిలో ఆశను ప్రోత్సహించడం ద్వారా ఆత్మహత్య ఆలోచనలు మార్చడం వలన ఆత్మహత్యల రహిత సమాజాన్ని సృష్టించవచ్చు. ఆత్మహత్య ఆలోచనలను అధిగమించి జీవితాశయాన్ని నెరవేర్చుకున్న వ్యక్తుల జీవిత కథలను తెలియచేయడం ద్వారా వ్యక్తులు తమవంతు సహాయం చేరుకోవడంలో చాలా శక్తివంతమైనవిగా పనిచేస్తాయి. ఆత్మహత్య ఆలోచనలు కలిగిఉన్న వ్యక్తుల భావోద్వేగ బాధలు, ఆత్మహత్య ఆలోచనలు లేదా ప్రయత్నం మరియు వారి రికవరీ అనుభవాల వ్యక్తిగత కథలు ఇతరులకు కూడా ఆశావాదాన్ని ప్రేరేపించగలవు, కష్టాలను ఎదుర్కొనే మనోదైర్యాన్ని నింపుకోగలరు. ఆత్మహత్యల నుండి బయట పడ్డ వారి కొత్త సాధారణ జీవితాన్ని ఎలా అనుభవించాలో అనుభవాలను పంచుకునే వ్యక్తులు, ఆత్మహత్య నష్టాన్ని అనుభవిస్తున్న ఇతరుల నష్టాన్ని తట్టుకుని జీవించగలరని నమ్ముతారు.
పరోక్ష సంకేతాలను పరిశీలించాలి
ఆత్మహత్యకు పాల్పడే వారిలో కొన్ని మార్పులు గమనించవచ్చు. ఒంటరితనంనకు ఇష్టపడటం, మద్యం అతిగా సేవించటం, ప్రతికారం తీర్చుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శించడం, అతిగా నిద్ర పోవడం, రాత్రి సమయంలో నిద్ర పోకుండా అతిగా ఆలోచించడం, అనవసర (ప్రాధాన్యతలేని) విషయాల పట్ల అతిగా స్పందించటం, అసలు స్పందించక పోవటం, చనిపోతున్నాని ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను ముందుగానే స్నేహితులు, కుటుంబసభ్యులు పరిశీలించి సైకాలజిస్ట్ ను సంప్రదించడం ద్వారా కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ ద్వారా కొంత వరకు ఆత్మహత్య ఆలోచలను నివారించవచ్చును.
జీవితం పై ఆశను సృష్టిద్దాం ఆత్మహత్యలు నివారిద్దాం
చర్య ద్వారా ఆశను సృష్టించడం అనేది ఆత్మహత్యకు ప్రత్యామ్నాయం ఉందని గుర్తుచేస్తుంది. ప్రజలందరిలో విశ్వాసం మరియు వెలుగును ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఆత్మహత్యను నివారించడం సాధ్యమవుతుంది. ఎవరైనా వ్యక్తులు చీకటి క్షణాల్లో బ్రతుకుతున్న వారిలో వెలుగును ప్రసాదించడానికి, ఆత్మహత్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారికి లేదా ఆత్మహత్యతో బాధపడుతున్న వారికి మాట సాయం, వారికి అవసరమైన మద్దతు ఇవ్వడంలో సమాజ పాత్ర ఉంది.
ఆత్మహత్య ఆలోచనలు సంక్లిష్టం
ఆత్మహత్యకు దారితీసే కారకాలు మరియు కారణాలు సంక్లిష్టంగా ఉంటాయి. ఆందోళన మరియు డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా ఒక కారణమవుతాయి. ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు తమ స్నేహితులు, కుటుంబం మరియు చుట్టుపక్కల వారితో కలవడానికి ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడుతూ ఉంటారు. చర్య ద్వారా ఆశను సృష్టించడం ద్వారా, ఆత్మహత్య ఆలోచనలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు జీవితం పై ఆశ పెరగడానికి వారి పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీరు తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారని చూపించడం ద్వారా ఎవరికైనా ఆశను అందించడంలో మీరు సహాయపడవచ్చు. ఎవరైనా తమ బాధలు లేదా ఆత్మహత్య ఆలోచనలు అనుభవాలను చెబితే వినడానికి సమయం మరియు స్థలాన్ని కేటాయించడం ద్వారా వారిలో ఆత్మహత్య ఆలోచనలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఆత్మహత్య ఆపగల మరణం. చిన్న చర్చ జీవితాలను కాపాడగలదు వ్యక్తిలో ఆశను సృష్టించగలదు అని గుర్తుంచుకోండి.
క్షణికావేశం జీవితాన్ని చిదిమేస్తుంది
క్షణికావేశంలో తీసుకొనె నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురిగొల్పబడుతాయి. మనపై ఆధారపడిన, చిన్నప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలించడం భావమా. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది.
ఆత్మన్యూనతతో ఆత్మహత్య భావనలు
ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు అందులో ప్రధానంగా మారుతున్న కాలానుగునంగా మారలేకపోవడం, తనపై తనకు నమ్మకం సన్నగిల్లడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కోవాలనే ఆలోచనలు తక్కువ కావడం, ప్రతి దానికి ఇతరులతో తమను తాము పోల్చుకుని ఆత్మన్యూనతతో భావనలను కలిగిఉండడం, ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడడం, ఏవేవో సంఘటనలు జరుగుతాయని భావించి అనవసరమైన విషయాలను ఊహించుకుని భయపడడం, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడు వారిలో ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన ఆర్థిక నష్టం భరించలేక, ఉద్యోగం సాధించటంలో వైఫల్యం పొందినవారు, భౌతిక, లైంగిక వేధింపులకు గురికావడం, కుటుంబ సామాజిక సంబంధాల లోపం, సమాజంలో స్తాయి కోసం శక్తికి మించి పనులు చేయడం, వృద్దాప్యంలో నిరాదరణకు గురికావడం, ప్రేమలో వైఫల్యం పొందడం,దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ, మానసిక వేదనతో, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు అనిపించినవారు, సమాజంలో పరువుపోతుందన్న భయంతో బాధపడుతున్నవారు, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేకపోతున్నామనుకునేవారు
ఆత్మహత్యకు పాల్పడే వారిని ముందుగా గుర్తించగలమా
ఆత్మహత్యకు పాల్పడే వారిలో కొన్ని మార్పులు గమనించవచ్చు. ఒంటరితనంనకు ఇష్టపడటం, మద్యం అతిగా సేవించటం, ప్రతికారం తీర్చుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శించడం, అతిగా నిద్ర పోవడం, రాత్రి సమయంలో నిద్ర పోకుండా అతిగా ఆలోచించడం, అనవసర (ప్రాధాన్యతలేని) విషయాల పట్ల అతిగా స్పందించటం, అసలు స్పందించక పోవటం, చనిపోతున్నాని ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను ముందుగానే స్నేహితులు, కుటుంబసభ్యులు పరిశీలించి సైకాలజిస్ట్ ను సంప్రదించడం ద్వారా కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ ద్వారా కొంత వరకు ఆత్మహత్య ఆలోచలను నివారించవచ్చును.
క్షణం ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం
క్షణికావేశంలో తీసుకొనె నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురిగొల్పబడుతాయి. మనపై ఆధారపడిన, చిన్నప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలించడం భావమా. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది.
– డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్- 9703935321