పట్టుకుని వెళ్ళి కాల్చి చంపారు

మైనింగ్‌ ‌కంపెనీల కోసమే ఆపరేషన్‌ ‌కగార్‌.. ‌
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ విడుదల

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబరు 14: ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. దంతెవాడ నారాయణపూర్‌ ఎన్‌ ‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్ట్‌లు అమరులయ్యారని.. గోవాడి, బొండోస్‌, ‌తుల్తులి అటవీ ప్రాంతంలో ఎన్‌ ‌కౌంటర్‌ ‌జరిగిందని, కార్పొరేట్‌ ‌మైనింగ్‌ ‌కంపెనీల కోసం పోలీసులు ఆపరేషన్‌ ‌కగార్‌ ‌నిర్వహించారని పేర్కొంది. అక్టోబర్‌ 4‌వ లేదీ ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు భద్రతా బలగాలు కాల్పులు జరిపారని.. ఎదురు కాల్పులు ల్లో 14 మంది మావోయిస్ట్‌లు అమరులయ్యారని, మరుసటి రోజు ఉదయం అక్టోబర్‌ 5‌న కాల్పుల్లో గాయపడిన‌ 17 మందిని పట్టుకుని హత్య చేశారని పేర్కొంది. తూర్పు బస్తర్‌ ‌డివిజన్‌ ‌కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ ‌పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంద‌ని మండిపడింది. అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ విప్లవోద్యమం ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేసింది. తూర్పు బస్తర్ ‌డివిజన్‌ ‌కమిటీ పేరుతో మావోయిస్ట్ ‌పార్టీ లేఖ విడుదల చేసింది. కాగా అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం అక్టోబర్‌ 4 ‌జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు.

అక్కడ బస్తార్‌ ఐజీ పి. సుందర్‌రాజన్‌ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టులో 13 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ పీఎల్‌జీఎ 6 బెటాలియన్‌ ‌సభ్యులని తెలిపారు. మృతుల్లో ఇప్పటివరకు 15 మందిని పోలీసులు గుర్తించారు. వీరిపై రూ.1.30 కోట్లు రివార్డు ఉందని ఐజీ తెలిపారు. ఇంకా 16 మంది మావోయిస్టులను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు చెందిన 30 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అబూజ్‌మడ్‌ అడవుల్లో సుమారు 50 నుంచి 70 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం రావడంతో ఎస్టీఎఫ్‌, ‌బీఎస్‌ఎఫ్‌, ‌బీఆర్‌జీ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేందూరు, తూలితూలి అడవుల్లోకి జవాన్లు చేరుకోగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా బలగాలు ఎదురు కాల్పులు నిర్వహించినట్లు తెలిపారు.

శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయన్నారు. క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ‌ప్రాంతంలో ఒక ఐఎంజీ మిషన్‌గన్‌, 4 ఏకే 47గన్స్, ఇతర తుపాకులు, బులెట్లు, బీజీయల్స్, ‌పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. దండకారణ్య కమిటీ సభ్యురాలు నీతి అలియాస్‌ ఉర్మిళపై రూ.21లక్షల రివార్డు ఉందని ఐజీ తెలిపారు. ఇప్పటికి గుర్తించిన వారిలో తెలంగాణ రాష్ట్రాని చెందిన వారు ఎవరూ లేరని, మిగతా వారి గుర్తించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page