కులాలు, భాష పేరుతో ప్రజల్ని విభజించడం దురదృష్టకరం

మొదటిసారి హైదరాబాద్‌ ‌వేదికగా ‘లోకమంథన్‌ ‌భాగ్యనగర్‌-2024’
వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ కలిస్తేనే భారతవాసీ
22న ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుచే స్టాల్స్ ‌ప్రారంభం
జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా బిర్సా ముండా జయంతి
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి
లోకమంథన్‌-24‌కు అన్ని వర్గాల ప్రజలు రావాలని పిలుపు

హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కులాలు, భాష పేరు మీద ప్రజలను విభజించే ప్రయత్నం చేయడం దుర దృష్టకరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు. సరైన సమయంలో రాజకీ యాలకు తీతంగా జాతీయ భావజాలంతో నడిచే ‘లోకమంథన్‌ ‌భాగ్యనగర్‌-2024’ ‌కార్యక్రమం హైదరాబాద్‌ ‌వేదికగా జరగకం చాలా గొప్పవిషయం అని అన్నారు. వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ ఈమూడు కలిస్తేనే భారతవాసీ అని అన్నారు. ఈ మేరకు శుక్రవారం బేగంపేట్‌ ‌లోని పీపుల్స్ ‌ప్లాజాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రపంచంలోని సమస్యల మీద చర్చ జరపడం, ప్రపంచంలోని సమస్యల పరిష్కారం కోసం ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి కావాల్సిన వ్యవస్థను నిర్మాణ చేసుకోవడం అనే అం శాలు లోకమంథన్‌ ‌కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం అని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

 

ఈ కార్యక్రమంలో అనేక ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు. భగవాన్‌ ‌బిర్సా ముండా జయంతి సందర్భంగా నవంబర్‌ 15‌వ రోజును జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా భారత ప్రభుత్వం గతంలో ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ లోకమంథన్‌ ‌కార్యక్రమంలో వందలాదిమంది గిరిజన కళాకారులు పాల్గొని వారు చేసిన చేతివృత్తులను ప్రదర్శిస్తారని, కళా ప్రదర్శనలు, స్టాల్స్ ‌లో ప్రజలకు తమ నైపుణ్యాలను వివరిస్తారని చెప్పారు. గతంలో ఈ కార్యక్రమం భోపాల్‌, ‌రాంచీ, అస్సాంలో జరిగిందని, మొదటిసారి దక్షిణ భారతదేశం(హైదరాబాద్‌)‌లో జరుగుతుందని తెలిపారు. ఈనెల 21 న స్టాల్స్, ఎగ్జిబిషన్స్, ‌రిజిస్ట్రేషన్‌ ఉం‌టుందని, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

22 న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ చేతుల మీద ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని పేర్కొ న్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే కళాప్రదర్శనలు, స్టాల్స్, ఎగ్జిబిషన్‌ ‌కార్యక్రమాలను చూడటానికి అన్ని వర్గాల ప్రజలు రావాలని పిలుపునిచ్చారు. వందకు పైగా కల్చరల్‌ ఆక్టివిటీస్‌ ఉం‌టాయని, 1000 మంది కళాకారులు పాల్గొంటారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page