అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి!

రాజకీయాల్లో  సిద్దాంతాలు పక్కకు పోయాయి. రోజురోజుకూ విలువలు విలువలు పడిపోతున్నాయి. ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్నిపార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది. అధికారం ఉన్న పార్టీలో ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోతున్నారు. విపక్ష పార్టీలు కూడా సమర్థంగా పనిచేయడం లేదు. అధికార పార్టీని విమర్శించడం, ఐదేళ్ల తరవాత అదృష్టం ఉంటే మళ్లీ మనదే అధికారం అన్న ధోరణిలో రాజకీయాలు నెరపుతున్నాయి. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి.. పరస్పర విమర్శలతో పబ్బం గడుపుకునే పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో  ఇప్పుడు అదే పరిస్థితి ఉంది.

తిరుమల వ్యవహారం తీసుకుంటే గత పాలకులు ఇందులో తప్పేమి జరగ లేదని బుకాయిస్తున్నాయి. అధికార టిడిపిపై విమర్శలు చేస్తే సరిపోతుందని ఎదురుదాడికి దిగుతున్నారు. తిరుమలలో అపచారం జరిగితే దానికి గత పాలకులేద బాధ్యత. వారు దీనిపై విచారణ జరగాలని కోరుకోవాలి. కానీ అలా కాకుండా ఇదంతా రాజకీయ ఎత్తుగడ అని కొట్టి పారేస్తున్నారు. తమ హయాంలో జరగిన పాపాలపై విచారణ కోరుకోవడం లేదు. అందుకే రాజకీయాల్లో విలువలు లేవనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఇకపోతే తెలంగాణలొ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి, భ్రష్టు పట్టించిన బిఆర్‌ఎస్‌, ఎపిలో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో దివాళా తీయించిన జగన్‌ ఇప్పుడు ఒకే తరహా రాజకీయాలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలపై విరుచుకు పడుతున్నారు.

తెలంగాణలో వీరికి బిజెపి కూడా తోడయ్యింది. ప్రాంతీయ పార్టీలు, సిద్దాంత భావజాలాన్ని కలిగివున్న బిజెపి వరకు అధికారమే పరమావధిగా రాజకీయాలు నెరపుతున్నాయి. ఇకపోతే అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడానికే నేతలంతా చూస్తున్నారు. తమ రాజకీయ అవసరాన్ని ప్రజల అవసరంగా చిత్రీకరించి కొందరు పార్టీలు మారుతున్నారు. దీనికి ఎవరూ మినహాయింపు కాదు.  ఈ క్రమంలో ప్రజలు, దేశం, సమస్యలు పక్కకుపోయాయి. వారు అనుకున్నదే అసలుసిసలు రాజకీయంగా మారింది. ఎంతటి నేతల్కెనా అధికారపార్టీలో చేరడానికి వెరవడం లేదు. రాజకీయనిబద్దత పక్కకుపెడుతున్నారు. అధికారపార్టీ అయితే తమ పబ్బం గడుపుకోవొచ్చు. అందులో చేరడానికి సవాలక్ష కారణాలు చూపాల్సిన అసవరం లేదు. రాజకీయాల్లో విలువలు లేవని, వ్యక్తులకు పార్టీల పట్ట విశ్వాసం కన్నా పదవులపైనే మోహం ఉందనడానికి తాజా రాజకీయాలే ఉదాహరణ. ఇలా ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో   అధికార పార్టీల్లోకి చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే  మోదీ  పనితీరు నచ్చిందని, దేశానికి ఆయనే ఆశాజ్యోతి అని బిజెపి పార్టీలో చేరేముందు కొందరు ప్రవచానాలు  వల్లిస్తున్నారు.

గతంలో తెలంగాణలో పలువురు టిఆర్‌ఎస్‌లో చేరగా దానిని బిఆర్‌ఎస్‌ గర్వంగా చాటుకుంది. కానీ ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు పార్టీని వీడేసరికి గగ్గోలు పెడుతోంది. వీరంతా చెప్పేది ఒక్కటే..చేరిన పార్టీ మంచిదనే. ఇలా చేయడంలో కేవలం స్వార్థ రాజకీయాలు తప్ప మరోటి కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ పదవులు అనుభవించి, పార్టీ అధినేత అడుగలకు మడుగులొత్తిన వారు అధికారం కోల్పోగానే అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు ఉత్సాహం  చూపుతున్నారు. అనేక పదవులు అనుభవించి, రాజకీయంగా ఎదుగుదలకు కారణం అయిన  పార్టీని, దాని అధినేతలను తిట్టాల్సినన్ని తిట్లు తిట్టి మరీ పార్టీలు మారుతున్నారు. ఇదంతా రాజకీయంగా తమ అవసరం కోసమే అన్నది వేరుగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ ఉనికి కోసం అనేక కారణాలు చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారు రాజకీయ ఎత్తులు వేస్తూ వీరిని అక్కున చేర్చుకుంటు న్నారు. పార్టీ మారదల్చుకుంటే మారాలి. అంతేగానీ వీడుతున్న పార్టీపై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని   నేతలు గుర్తించాలి. రాజకీయ అవసరార్థం ఎప్పుడు ఏద్కెనా మాట్లాడే అలవాటు మన రాజకీయ నేతలకు ఉంది.

చాలామంది ప్రాంతీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు అవకాశం వస్తే దిల్లీ గద్దెను ఎక్కాలనే కుతూహలంతో ఉన్నవారు అనేకులు ఉన్నారు.  రాష్ట్రాల్లో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకత్వంలో మొన్నటి ఎన్నికలకు ముందు అంతా చేతులు కలిపారు. అయితే వీరంతా అటుఇటుగా పార్టీలు మారుతూ సిద్దాంతాల గురించి మాట్లాడడమే ఆశ్చర్యంగా ఉంది. ఏ పార్టీకి కూడా సిద్దాంతం లేదన్నది తాజా పరిణామాలను బట్టి గమనిం చాలి. అధికారమే అన్ని పార్టీల సిద్ధాంతం. అధికారం ఉంటేనే నేతలు పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు. లేకుంటే అధికారం ఉన్న పార్టీలోకి జంప్‌ అవుతారు. ఇందుకు ఎవరుకూడా మినహాయింపు కాదు. రాష్ట్రం ఏద్కెనా, పార్టీ ఏద్కెనా అధికారం ఉంటే అదే తమ పార్టీ అన్న ధోరణిలో నేతలు ఉన్నారు. ఇది రాజకీయ పార్టీల పతనానికి దారితీస్తోంది. ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం లేకుండా చేస్తోంది. రాజకీయనేతలు నిబద్దత కోల్పోతే ఎక్కువ కాలం నేతలుగా మనలేమని గుర్తిస్తే మంచిది.

తెలంగాణలో ఓ  విపక్ష బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. వీరిపై చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇతరులతో కూడా కేసులు వేయిస్తోంది. తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖల్కెంది. పార్టీ వీడిని వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలోనే ఓ మారు స్పీకర్‌ను ఆదేశించింది. ఎపిలోనూ జగన్‌కు వీరవిధేయులుగా ఉన్నవారు సైతం పార్టీని వీడుతున్నారు. అధికారం పోవడంతో అధికార టిడిపి, జనసేనల్లో చేరుతున్నారు. వీరు కూడా సిద్దాంతాలు, గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా తెరవిరీదకు తీసుకుని వస్తున్నారు. నిజానికి ఫిరాయిం పుల చట్టం పకడ్బందీగా లేకపోవడం, దానిని అమలు చేయాలన్న చిత్తశుద్ది పాలకుల్లో లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్లుగా పార్టీ ఫిరాయింపులు సాగుతున్నాయి. ఇందుకు అన్ని పార్టీలది ఒకటే సిద్దాంతం. దీనికి ఎక్కడో ఒకచోట తెరపడాలి. పార్టీ ఫిరాయింపులు, అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి.

 -రేగటి నాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page