అధికారుల‌పై ప్ర‌జ‌ల ముసుగులో గులాబీ గూండాల దాడి..

  • రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం కలిగించే యంత్రం
  • మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : రైతుల‌కు న‌ష్టం క‌లిగించాల‌న్న ఉద్దేశం ప్ర‌భుత్వానికి ఏమాత్రం లేద‌ని స‌మ‌స్య‌ల‌ను విన‌డానికి, ప‌రిష్క‌రించ‌డానికి త‌మ‌ ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంద‌ని రెవెన్యూ, హౌసింగ్ , స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. కొంద‌రు రైతుల ముసుగులో అధికారుల‌ను చంపే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ల‌గ‌చ‌ర్ల సంఘ‌ట‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంటుంద‌ని,
ఈ రోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లుగానే ..రేపు రాజ‌కీయ నాయ‌కుల‌కో, ప్ర‌జ‌ల‌కో జ‌రిగితే ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దని స్ప‌ష్టంచేశారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్న‌క‌లెక్ట‌ర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నారు. అధికారుల మీద దాడి అనేది మ‌న‌మీద మ‌నం దాడి చేసుకున్న‌ట్లే! రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కుట్ర‌పూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్ర‌య‌త్నం కొంత‌మంది చేస్తున్నారు గులాబీ గూండాల కుట్ర‌ల‌ను రైతాంగం అర్థం చేసుకోవాలి ప్ర‌జ‌ల‌ను కాపాడుకున్న‌ట్లే, అధికారుల‌ను కాపాడుకోలేక‌పోతే ప‌ని చేయ‌డానికి ఏ అధికారి ముందుకు వొస్తారు? అని పొంగులేటి ప్ర‌శ్నించారు. బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారం వెల‌గ‌బెట్టిన‌నాడు ఇదే ప‌ద్ద‌తి చేశారా? ఏం త‌ప్పుచేశార‌ని ఆనాడు ఖ‌మ్మంలో మిర్చి రైతుల‌కు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ లో రైతుల‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించారు. పిల్లా, పాపా, ముస‌లి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగ‌తి మ‌రిచారా? అని నిల‌దీశారు. ఎగిరెగిరి ప‌డుతున్న కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో ద‌ళితుల‌కు బేడీలు వేసిన సంగ‌తి మ‌రిచిపోయారా? ల‌గ‌చ‌ర్ల‌లో ఆ ప‌రిస్ధితి లేదు క‌దా? అని మంత్రి పొంగులేటి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page