ప్రవక్త ప్రేరిపిత బోధకుడు
గడువు ముగిసిన మనిషి

సత్యన్వేషణావధి దాటి
పరిణామ క్రమం లో వ్యక్తి
ప్రవక్త గా మార్పు చెందుతాడు

జీవనానికీ కావాలిసిన
సిద్దాంతాలు, మార్గదర్శకాలు
లోకము, పరలోకము
సచ్చిలత, హెచ్చరికలన్నీ
మతగ్రంథాలాధారం గా
ప్రభోదించబడుతాయి

మానవాళి మంచిని మరచిన వేళ
దైవత్వము ఆయుధమవుతుంది
దైవాన్ని క్రమంగా నమ్మిన నరుడు
మానవత్వాన్ని విస్మరిస్తాడు

బట్టి పట్టిన వ్యాక్యాలను
ఉచ్చరిస్తూ, ఉచ్చరిస్తూ
ఏదో ఒకరోజు ప్రవక్త కాలం చేస్తాడు
అతని మనసు వేరేకరికీ
అద్దె ఇవ్వబడుతుంది

ఈ దేశానికి కావాలిసిందోకరే
అతడే ఆఖరి ప్రవక్త
కావాలి అతని మతం మానవత్వం

 -ఐ. చిదానందం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page