21, 22 తేదీల్లో నగరంలో   రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన 

 ఏర్పాట్ల పై ప్రధాన కార్యదర్శి సమీక్ష 

ఈ నెల 21, 22 తేదీల్లో భారత రాష్ట్రపతి రెండు రోజులపాటు నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్‌ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆమె ఆదేశించారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు అన్ని వేదికల వద్ద తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందితోపాటు అర్హులైన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రపతి బస చేసే ప్రదేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని MAUD శాఖను ఆదేశించారు. అన్ని వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ ను ఆదేశించారు. డీజీపీ జితేందర్‌, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, డీజీ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ బీ వెంకటేశం, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ వెంకట్‌రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్  హరీశ్‌, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page