19‌న ప్రజాపాలన బహిరంగ సభ

అదేరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం
హాజరుకానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి
భారీ ఏర్పాట్లపై  టీపీసీసీ చీఫ్‌ ‌సమీక్ష
పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ

హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 16:   ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌ ‌లో ఈనెల 19    ఇందిరా మహిళా శక్తి సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు.  ఈసందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షులు, వరంగల్‌ ‌పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ ‌రెడ్డి  అధ్యక్షతన హనుమకొండ నయిమ్‌ ‌నగర్‌లో నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్‌ ‌కమిటీ అధ్యక్షులు  బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌   ‌మంత్రులు కొండ సురేఖ, దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబు, పొన్నం ప్రభాకర్‌ , ‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా 11నెలల ప్రజా ప్రభుత్వ పనితీరుపై ఈ నెల 19న హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌స్టేడియంలో నిర్వహించే ఇందిరా శక్తి సభ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న కాళోజి కళక్షేత్ర కార్యక్రమాలపై సుదీర్గంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ… గడిచిన 11నెలలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ ని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మన పనీతిరు ప్రజలు గమనిస్తున్నారని,  ప్రతిపక్షం సోషల్‌ ‌మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పటికి నిజమైన లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం చేరుతుందని చెప్పారు.

ప్రజాస్వామిక పద్దతిలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ముంధుకు వెళుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి  పర్యటనలో వరంగల్‌ ‌నగరానికి అభివృద్ధి వరాల వస్తున్నాయని, మహా నగర అభివృద్ధికి కీలక ప్రకటనలు చేయనున్నారని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌, ‌ప్రభుత్వవిప్‌ ‌రామచంద్రు నాయక్‌, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌ ‌రెడ్డి, కేఆర్‌ ‌నాగారాజు, గండ్ర సత్యనారాయణ రావు, డాక్టర్‌ ‌మురళి నాయక్‌, ‌మేయర్‌ ‌గుండు సుధారాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, పైడాకుల అశోక్‌, ‌ప్రకాష్‌ ‌రెడ్డి, ప్రతాప్‌ ‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ‌మార్నెని రవీందర్‌ ‌రావు, కుడా  చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామ్‌ ‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌రియాజ్‌ , ‌టీపీసీసీ నాయకులు,రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page