వెంకటాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రామప్ప దేవాలయం (Ramappa Temple) మహా అద్భుతమైన కట్టడం అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా జడ్జి ఎస్.వి.పి.సూర్యచంద్ర కళ, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్, అదనపు సివిల్ జడ్జి జె.సౌఖ్య, జిల్లా ఎస్పీ శబరిష్ లు పూల బొకేలు మొక్కలతో స్వాగతం పలికారు, ఆలయ అర్చకులు కోమల్లపల్లి హరీష్ శర్మ, మోహన మఠం ఉమాశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహా మండపంలో వారిని శాలువాలతో సన్మానించి మహా ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ రామప్ప దేవాలయం మహాఅద్భుత కట్టడమని, 800 సంవత్సరాల క్రితమే అత్యద్భుతమైన టెక్నాలజీ తో నిర్మించారని, నీళ్లలో తేలే ఇటుకలు.. సాంగ్ బాక్స్ టెక్నాలజీ గర్భగుడిలోని లైటింగ్ ప్రతిదీ అత్యద్భుతమని కొనియాడారు. ఇప్పటి కంటే ఆనాడే అడ్వాన్స్ టెక్నాలజీ ఆధునికత ఉండడానికి అప్పటి హై హీల్స్ మినీస్ కార్డ్స్ ఇక్కడ రాయిలో సరిగమలు సూక్ష్మ రంధ్రాలు నిదర్శనమని అన్నారు. జడ్జి దంపతులు ఆలయంలోని శిల్పాలను ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సిహెచ్. పంచాక్షరీ, ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.వి.పి సూర్యచంద్రకళ, హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సిహెచ్.రమేష్ బాబు, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి.నిర్మల గీతంబా, సీనియర్ సివిల్ జడ్జి టి. కన్నయ్య లాల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె. సౌఖ్య, జిల్లా ఎస్పీ శబరీష్, ఆర్.డి.ఓ వెంకటేష్, డి.ఎస్పీ రవీందర్, సి.ఐశంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్.వినయ్ కుమార్, జనరల్ సెక్రెటరీ కె. సునీల్ కుమార్, ఎస్సై సతీష్, తాసిల్దార్ సదానందం ఆర్ఐ రమేష్, న్యాయవాదులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, కొర్టు సిబ్బంది, టూరిజం దేవాదాయ పురావస్తు శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.