నేడు నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర పోలీసులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచా కాల్పులు, లేజర్‌ ‌షోలు ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్నాయి. ఈ  సందర్భంగా గురువారం నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు ఉంటాయని హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసులు వెల్లడించారు. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్‌ ‌వరకూ ట్రాఫిక్‌ ఆం‌క్షలు ఉంటాయని ఓ ప్రకటనలో వెల్లడించారు. గురువారం రోజు సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రాంతాల గుండా వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాలను చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆంక్షలు ఉన్న ప్రాంతాలు, దారి మళ్లింపు గురించి వెల్లడించారు. ఇక్బాల్‌ ‌మినార్‌ ‌నుంచి అప్పర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఒవర్‌ ‌వైపు మళ్లించనున్నారు.

రాణిగంజ్‌ ‌నుంచి నెక్లెస్‌ ‌రోడ్‌ ‌వైపు వచ్చే వాహనదారులను నల్లగుట్ట క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద మినిస్టర్‌ ‌రోడ్‌ ‌వైపునకు మళ్లిస్తారు. మినిస్టర్‌ ‌రోడ్‌ ‌నుంచి నెక్లెస్‌ ‌రోడ్‌ ‌వైపు వచ్చే వారిని నల్లగుట్ట క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద రాణిగంజ్‌ ‌వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి ఎగువ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద ఇక్బాల్‌ ‌మినార్‌ ‌వైపు మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ ‌నుంచి అప్పర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బలా మైదాన్‌ ‌వద్ద బైబిల్‌ ‌హౌస్‌ ‌వైపునకు మళ్లిస్తారు. ధోబీ ఘాట్‌ ‌నుంచి చిల్డన్్ర‌ ‌పార్క్/అప్పర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వచ్చే వారిని డీబీఆర్‌ ‌మిల్స్ ‌వద్ద కవాడిగూడ క్రాస్‌ ‌రోడ్‌ ‌వైపునకు పంపిస్తారు. డీబీఆర్‌ ‌మిల్స్ ‌నుంచి వచ్చే ప్రయాణికులను కవాడిగూడ క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద జబ్బార్‌ ‌కాంప్లెక్స్, ‌సీజీవో టవర్స్ ‌వైపు మళ్లించనున్నారు. సెయిలింగ్‌ ‌క్లబ్‌ ‌వైపు వెళ్లాలనుకునే సీజీవో టవర్స్ ‌నుంచి వచ్చే వాహనదారులను కవాడిగూడ క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద డీబీఆర్‌ ‌మిల్స్, ‌జబ్బార్‌ ‌కాంప్లెక్స్ ‌వైపు మళ్లిస్తారు.

సికింద్రాబాద్‌ ‌నుంచి ట్యాంక్‌ ‌బండ్‌ ‌దుగా వెళ్లే అన్ని అంతర్‌ ‌జిల్లా ఆర్టీసీ బస్సులు స్వీకర్‌ – ఉపకార్‌ ‌జంక్షన్‌ ‌వద్ద సంగీత్‌- ‌మెట్టుగూడ -తార్నాక – నల్లకుంట- ఫీవర్‌ ‌హాస్పిటల్‌ ‌క్రాస్‌ ‌రోడ్‌- ‌బర్కత్‌పురా – టూరిస్ట్ ‌హోటల్‌ – ‌నింబోలి అడ్డా – చాదర్‌ఘాట్‌ ‌వద్ద మళ్లించబడతాయి. ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వచ్చే సిటీ బస్సులను కర్బలా మైదాన్‌ ‌వద్ద బైబిల్‌ ‌హౌస్‌ ‌వైపునకు మళ్లించనున్నారు. ట్రాఫిక్‌ ‌రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు పాత అంబేద్కర్‌ ‌విగ్రహం, కవాడిగూడ క్రాస్‌రోడ్స్, ‌కట్ట మైసమ్మ, కర్బలా మైదాన్‌, ‌రాణిగంజ్‌, ‌నల్లగుట్ట, ఖైరతాబాద్‌గ్‌తెలంగాణ తల్లి ఫ్లైఒవర్‌ ‌జంక్షన్ల వైపు వెళ్లొద్దని ట్రాఫిక్‌ ‌పోలీసులు తెలిపారు.అలాగే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌ ‌బండ్‌కు వాహనాల్లో వచ్చే ప్రజలకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్‌ ‌స్టేడియం, ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లోని రేస్‌ ‌కోర్స్ ‌రోడ్డు, జీహెచ్‌ఎం‌సీ కార్యాలయం- బీఆర్కే భవన్‌ ‌మధ్య రహదారి, లోయర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌రోడ్‌పై పార్కింగ్‌ ‌సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. దయచేసి గురువారం జరిగే వేడుకలకు వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలని నగర ట్రాఫిక్‌ ‌పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page