Supreme Chief Justice ‘‌సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌గా సంజీవ్‌ ‌ఖన్నా

ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హాజరైన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తదితరులు

న్యూదిల్లీ, నవంబర్‌11 (ఆర్‌ఎన్‌ఎ): ‌భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగాజస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నాతో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు..   సీజేఐగా జస్టిస్‌ ‌డి.వై.చంద్రచూడ్‌ ‌పదవీకాలం ముగిసింది. దీంతో జస్టిస్‌ ‌డి.వై.చంద్రచూడ్‌ ‌తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖర్‌, ‌మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా.. వొచ్చే ఏడాది 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు.

2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులోన్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నాఈ ఆరేళ్ల కాలంలో 117 తీర్పులు రాశారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ ‌ఖన్నా ఆరు నెలల పదవీకాలం తర్వాత మే 13, 2025న పదవీ విరమణ చేయనున్నారు. ఏ హైకోర్టుకైనా ప్రధాన న్యాయమూర్తి కాకముందే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన అతికొద్ది మంది న్యాయమూర్తులలో ఆయన ఒకరు.

దిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా.. 1983లో దిల్లీ బార్‌ ‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ‌ప్రారంభించారు. ట్యాక్సేషన్‌, ఆర్బిట్రేషన్‌, ‌కమర్షియల్‌, ‌కంపెనీ లా కేసులు వాదించారు. 2005 జూన్‌ 25‌న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతేకాకుండా.. ఆదాయపు పన్ను శాఖకు సీనియర్‌ ‌స్టాండింగ్‌ ‌కౌన్సెల్‌గా, క్రిమినల్‌ ‌కేసుల్లో అదనపు పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌గా, అమికస్‌ ‌క్యూరీగా.. పలు విభాగాల్లో కీలక సేవలను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page