చిత్రసీమలో భగ్గుమన్న పరువు లొల్లి!

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న చిత్రాలలో ఉంటున్న అసభ్యకరమైన సన్నివేశాల వలన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించ లేని పరిస్థితి..డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో మహిళల పరువు పోవడం లేదా? ఆ సమయాలలో చూసిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి కదా, పరువు నష్టం దావా వేసుకోవొచ్చునా..? ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి స్వంత భవనాలు నిర్మించినప్పుడు, మీ పరువు ఎటుపోయింది..? మీరు తీసిన సినిమాలకు వచ్చే పారితోషికం ఎంత..? మీరు కట్టే టాక్స్‌ ఎంత? అప్పుడు ప్రభుత్వాన్ని మోసం చేసిన అని తెలిసిన రోజు పరువు ఎటుపోయింది…? రేవ్‌ పార్టీలలో పట్టుబడినప్పుడు ఎటు పోయింది మి పరువు…? కొంత మంది డ్రగ్స్‌ కేసులలో పట్టుబడిన క్షణం మీ గొంతులు ఎందుకు ముగపోయినాయి.? భారత సంస్కృతి, భారత వివాహ బంధం గురుంచి గొప్పగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే మీరు ఎంత మందిని విడాకుల రూపంలో వదిలేసిన, రోజు మీ పరువు ఎటుపోయింది..? చిన్న చితక సినిమాలు తీస్తూ ఎదుగుతు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్న నటులను ఎలా తొక్కలి, సినీరంగంలో ఎలా ఎదగకుండా అడ్డుపడి వారి ఆత్మహత్యలకు కారణం అయిన రోజు మీ పరువు ఎటుపోయింది.? మీ ఇళ్లపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నప్పుడు ఈడీ దాడులు జరుగుతున్న సమయాలలో మీ పరువు ఎటుపోయింది…?

గతంలో టాలీవుడ్‌ పెద్దలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. సినిమా అవకాశాల పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా జరుగుతున్నాయని సామాజికవేత్తలు ఆరోపించారు. సినీరంగంలో మహిళలను ఆట వస్తువులుగా భావిస్తున్నా తగిన చర్యలు తీసుకోవడంలో సినీ పెద్దలు విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యభిచార ముఠా నడిపి టాలీవుడ్‌ పరువు తీసిన కో డైరెక్టర్‌ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినబడుతున్నా సిని’మా’ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆ సమయంలో మీ పరువు ఏటుపోయింది అని సందేహిస్తున్నం? సాధారణ ప్రజలకు, బయటి ప్రపంచానికి వ్యభిచారం అనేది ఓ పెద్ద తప్పులా కనిపిస్తున్నా… సినిమా రంగంలో మాత్రం ఇది కామన్‌ అయి పోయింది. తరచూ సినీరంగానికి చెందిన పలువురు అరెస్టు అవుతున్నా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక బతుకు బండి సాగించేందుకు కొందరు, జల్సా జీవితానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం మరికొందరు కారణాలు ఏమైనా కానివ్వండి.., పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు దొరకని సినీ కవులు ఎందరో ఉన్నారు. సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఎన్నో అవమానాలకు గురయ్యారు, వారికి అండగా నిలిచి వారిలో ఉన్న నైపుణ్యంనీ చూసి అవకాశాలు కల్పించాల్సినది పోయి కొంత మంది వేధింపులకు గురిచేస్తున్నారు.

కొంతమంది సినీ నటులు బ్లడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేసి , కొంత మంది స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు, మరి కొందరు సినిమాలతో, టికెట్స్‌ ధరలు ఎలా పెంచాలి, ఏవిధంగా సొమ్ము అర్జించాలి అనే ఆలోచనలోనే ఉన్నారు, వాటినుండి బయటపడి, మీ సినిమాలు హిట్‌ అవ్తున్నాయి అంటేనే చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టే, కనుక ప్రజలకు ఆపద సమయంలో అదుకొని మీ దయార్థ హృదయం చాటుకొండి. ఏది ఎం అయినామీలో ఉన్న ఐకమత్యం గొప్పగా అనిపించింది కానీ, ఏ నటుడు, నటీ, తప్పుచేసిన చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు అని గట్టిగా ప్రశ్నిస్తుంది ఈ సమాజం..?? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తారా లేదా కొంపతీసి పరువు నష్టం దావా వేస్తారా ..?
-జాజుల దినేష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page