తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కొండ సురేఖ భారత రాష్ట్ర సమితి నాయకుడు కె తారకరామారావును ఉద్దేశించి అన్న మాటలు, ఆ మాటల్లో దొర్లిన ఇతరుల ప్రస్తావనలు, వాటి మీద రేగిన దుమారం కొని రోజుల పాటు వ్యాపించింది. ఒకరిపై ఒకరు నోళ్లు మూసీలుగా మారాయని, ఆ మూసీ మురికి కాలువలను కడగాలని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సరిగ్గా మూసీ సుందరీకరణ, రాజకీయ నాయకుల నోళ్ల ప్రక్షాళన కార్యక్రమాల పిలుపులు ఒకేసారి రావడం కవితాన్యాయం అనిపిస్తుంది. ఆ పోలిక అక్కడితో ఆగేది కాదు. మరొక పోలిక కూడా ఉంది. అటు మూసీ సుందరీకరణా జరగబోయేది లేదు, ఇటు దుర్గంధపు మాటల నోళ్లూ కడగబోయేది లేదు.
ఎందుకంటే అవి మాటలను వెలువరిస్తున్న నోళ్లకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు. ఆ నోళ్ల వెనుక ఉన్న మెదళ్లు, ఆ మెదళ్లను అలా తీర్చి దిద్దిన మన సామాజికీకరణ క్రమాలు, మన సాంస్కృతిక వైఖరులు, రాజకీయాలు, సినిమాలు, ప్రచార సాధనాలు మన సామాజిక జీవిత ప్రవర్తనను నిర్దేశిస్తున్న, మారుస్తున్న తీరు అనే మరింత లోతైన విషయాల గురించి ఆలోచిస్తే, అత్యవసరమైన సవరణలు జరిపితే తప్ప ఈ దుర్గంధాన్ని క్షాళన చేసే పని ప్రారంభం కాదు.
ఒక రకంగా చూస్తే ఈ ఆరోపణ ప్రత్యారోపణలు మన సమాజంలో చర్చించవలసిన ఎన్నో ముఖ్యమైన విషయాలను లేవనెత్తుతున్నాయి. కాని సహజంగానే చర్చలను పక్కదారి పట్టించడంలో, అనవసరమైన చర్చలనే అవసరమైన విషయాలుగా వెయ్యినోళ్ల పలకడంలో, ఆ గాలి దుమారంలో అవసరమైన విషయాలను కనబడకుండా తారుమారు చేయడంలో సిద్ధహస్తులమైన మనం ఈసారి కూడా అట్లాగే ప్రవర్తించాం. ఇక్కడ మనం అన్నప్పుడు మనలో ప్రతి ఒక్కరమూ అని కూడా కాదు, ఈ దుర్మార్గంలో మనలో చాలమందికి భాగం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచనలనూ, ఆలోచనా సరళినీ నియంత్రిస్తున్న, మనం ఏమి ఆలోచించాలో, ఎట్లా ఆలోచించాలో మప్పుతున్న సినిమా, ప్రచార సాధనాలు, సామాజికీకరణ సాధనాలు ఒక ఎజెండాను సిద్ధం చేసి పెడుతున్నాయి. ఆ ఎజెండా పరిధిలోపల మాట్లాడకపోతే మనం సామాజికులం కామేమో అని మనను మనమే కించపరచుకునే స్థితిని కల్పించాయి. ఆ ఎజెండాకు మాత్రమే కట్టుబడి మాట్లాడేలా మనను ట్యూన్ చేస్తున్నాయి.
అందువల్ల అటు కొండా సురేఖ మాటలో, ఇటు ఆమె మాటలను ఖండించిన అనేక మంది సినిమా, రాజకీయ, పౌర సమాజ, మహిళా బృందాల మాటలను, తిట్లను, దూషణలను మాత్రమే చర్చా ప్రాతిపదికగా మార్చి, ఆటో ఇటో తేల్చుకోవలసిన విభజన రేఖను ప్రచార సాధనాలు గీసి పెట్టాయి. రెండు వైపులా తప్పు జరిగింది, జరిగే అవకాశం ఉంది, అసలు సాగిన వివాదమే అనవసరమైనది, అది తప్పకుండా చర్చించవలసిన విషయమే అయినప్పటికీ, ఆ చర్చ జరగవలసిన స్థాయి వేరు, పద్ధతి వేరు, అసలు ఇటువంటి మాటలకు ఉన్న సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మూలాల్లోకి వెళ్లి, అక్కడి నుంచి సవరణలు జరుపుకుంటూ రావలసి ఉంది అని మూడో వైఖరి ప్రకటించే, చర్చించే అవకాశమే లేకుండా పోయింది.
వివాదాస్పదమైన కొండా సురేఖ వ్యాఖ్యలు తన మీద జరిగిన ట్రోలింగ్ ను వ్యతిరేకిస్తున్న సందర్భంలో వచ్చాయి. ఒక స్త్రీగా ప్రజాజీవితంలో ఎదుర్కొన్న ఒక అవమానాన్ని ఎత్తిచూపే హక్కు ఆమెకు తప్పకుండా ఉంది. చేనేతకు సంబంధించిన ఒక కార్యక్రమంలో మంత్రిగా ఆమె పాల్గొన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆమె మెడలో చేనేత దండ వేశాడు. అధికార పక్ష వ్యక్తి మెడలో ప్రతిపక్ష వ్యక్తి దండ వేసినప్పుడు, అందులోనూ అక్కడ ఉన్నది స్త్రీ పురుషులైనప్పుడు, ఆ ఫొటోను ప్రచారం చేయదలచుకున్నవారు కనీస వివేకాన్ని పాటించాలి.
మనుషుల, ముఖ్యంగా స్త్రీల, అణగారిన వర్గాల, ఆత్మగౌరవాన్ని, వ్యక్తిగత గోప్యతా హక్కును గౌరవించడం, వ్యక్తిగత అంశాలను బహిరంగ సామాజిక జీవితంలో సంచలనం కోసం వాడుకోకుండా ఉండడం, స్త్రీలను, అణగారిన వర్గాలను కించపరిచే భాషా ప్రయోగాలను మన భాష నుంచి పరిహరించుకోవడం, రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం స్త్రీల వ్యక్తిత్వాల హననాన్ని ప్రతిఘటించడం, సమాజ జీవనంలో ప్రవేశించిన అనారోగ్యకరమైన, దుర్మార్గమైన అలవాట్లను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఖండించడం వంటి అంశాల మీద చర్చ జరగవలసి ఉంది. ప్రజా జీవనంలో సంస్కారం కోసం, పరస్పర గౌరవ మర్యాదల కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసి ఉంది. అవతలివారి వ్యక్తిత్వాన్ని ఎంతగానైనా హననం చేస్తాం, మా దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీతి సూత్రాలు చెపుతూ ఇల్లెక్కి అరుస్తాం లాంటి కపటత్వాన్ని ఖండించవలసి ఉంది. సామాజిక ప్రవర్తనలో అనారోగ్యకరమైన, దుర్మార్గమైన పద్ధతులకు పాల్పడేవారు ఎంత పెద్ద వారైనా, ఎంత ఆకర్షణీయమైన వారైనా, ఎంత గౌరవనీయులుగా మర్యాదస్తులుగా నటనలు ఒలకబోస్తున్నవారైనా నిర్ద్వంద్వంగా ఖండించవలసి ఉంది.
ఇలా సామాజిక సాంస్కృతిక మూలాలోకి విస్తరించవలసిన చర్చను వ్యక్తులకు కుదించి, వ్యక్తుల తప్పొప్పుల మీద తీర్పరులుగా కూచుని, ఒక నిరంకుశమైన తీర్పు చెప్పేసి అప్పటికి తమ పని అయిపోయిందని సంతృప్తి పడే, చేతులు దులిపేసుకునే వైఖరి అసలు సమస్యను ఎంతమాత్రమూ పరిష్కరించజాలదు.
వివాదాస్పదమైన కొండా సురేఖ వ్యాఖ్యలు తన మీద జరిగిన ట్రోలింగ్ ను వ్యతిరేకిస్తున్న సందర్భంలో వచ్చాయి. ఒక స్త్రీగా ప్రజాజీవితంలో ఎదుర్కొన్న ఒక అవమానాన్ని ఎత్తిచూపే హక్కు ఆమెకు తప్పకుండా ఉంది. చేనేతకు సంబంధించిన ఒక కార్యక్రమంలో మంత్రిగా ఆమె పాల్గొన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆమె మెడలో చేనేత దండ వేశాడు. అధికార పక్ష వ్యక్తి మెడలో ప్రతిపక్ష వ్యక్తి దండ వేసినప్పుడు, అందులోనూ అక్కడ ఉన్నది స్త్రీ పురుషులైనప్పుడు, ఆ ఫొటోను ప్రచారం చేయదలచుకున్నవారు కనీస వివేకాన్ని పాటించాలి. అది ఒక అధికారిక సందర్భం అని తప్పనిసరిగా చెప్పాలి. ఆ ఫొటోకు రాగల దురర్థాలను ముందే ఊహించి, అవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అసలు ఆ ఫొటో ప్రచారంలోకి తేకపోయినా ఫర్వా లేదనుకోవాలి. ఈ ఆలోచనలు రావాలంటే ముందుగా మనిషిగా సున్నితత్వం ఉండాలి. కొనసాగుతున్న వ్యవస్థలో ఒక అంశం ఎట్లా వక్రీకరణలకు, చిలవలు పలవలకు గురయ్యే అవకాశం ఉన్నదో సామాజిక, సాంస్కృతిక అవగాహన ఉండాలి. ఇవాళ మన ప్రచార సాధనాలలో అట్టడుగు ఉద్యోగులకు మాత్రమే కాదు, సంపాదక స్థాయిలో ఉన్నవారికీ, యజమానులకూ అటువంటి సున్నితత్వమూ, అంత లోతైన అవగాహనా లేవని కొత్తగా చెప్పనక్కరలేదు.
వైరల్ అయిన ఆ ఫోటో మీద భారత రాష్ట్ర సమితికి ట్రోలింగ్ సైన్యానికి చెందిన ఒక అనామక సైనికుడు దుర్మార్గమైన, అసభ్యకరమైన ట్రోలింగ్ ప్రారంభించాడు. దాని మీద సురేఖ మాట్లాడిన మాటల మీద స్వయంగా కేటీఆర్ కల్లబొల్లి ఏడుపులు అని వెటకారంగా వ్యాఖ్యానించాడు. దానికి జవాబుగా మాటకు మాటగా ఆమె తీవ్రంగా అభ్యంతరకరమైన, ఖండించవలసిన మాటలు మాట్లాడింది. వ్యాఖ్యలు ఎవరి మీద ఎక్కుపెట్టారో వారి మీద మాత్రమే కాకుండా, ప్రస్తుత సందర్భంలో సంబంధం లేని వ్యక్తుల మీద, కుటుంబాల మీద, వారి నైటీక ప్రవర్తన మీద వ్యాఖ్యలు చేసింది. అందులోనూ స్త్రీల వ్యక్తిగత జీవితానికి, గోప్యతకు సంబంధించి వ్యాఖ్యలు చేసింది.
మరొక వంక ఇవాళ మన ప్రచార సాధనాలన్నీ గట్టిగా కేంద్రీకరిస్తున్నదే సంచలనాల మీద. ఎంత మామూలు విషయానికైనా సంచలనపు రంగు పూసి, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ చేసి వీక్షకుల దృష్టిని ఆకర్షించడం ఎట్లా, టీఆర్పీ రేట్లూ అమ్మకాలూ పెచ్చుకోవడం ఎట్లా అని చూసే రాబందుల తత్వం ఇవాళ మీడియా పేరు మీద చలామణీ అవుతున్నది. వ్యవస్థీకృత ప్రచార సాధనాల దుస్థితి అలా ఉండగా కోతికి కొబ్బరి కాయ దొరికినట్టుగా ప్రతి మనిషీ చేతికీ అందిన సెల్ ఫోన్, దానిలో ఫొటోలు తీసే సౌకర్యం, ఆ ఫొటోలను విరివిగా ప్రచారం చేసే సౌలభ్యం, ఎటువంటి అవాకులూ చవాకులూ అబద్ధాలూ వక్రీకరణలూ పుకార్లూ వదంతులూ అయినా క్షణాల్లో వేల మందికి చేరవేసే అవకాశం వేలం వెర్రిలా మారిపోయాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఏదైనా చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా, ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయవలసిన సందదర్భంలో ఆ జాగ్రత్తలన్నీ గాలికి వదిలి వేస్తున్నారు. ఆ గాలి దుమారంలో అపారమైన చెత్త మన జేబులో నిండుతున్నది. ఆ చెత్తను కడగడం, మన జేబును, బహుశా అందరి జేబులనూ, అసలు వాతావరణాన్నే శుభ్రం చేయడం ఇవాళ తక్షణ అవసరాలని ఎంతమంది గుర్తిస్తున్నారో తెలియదు.
వైరల్ అయిన ఆ ఫోటో మీద భారత రాష్ట్ర సమితికి ట్రోలింగ్ సైన్యానికి చెందిన ఒక అనామక సైనికుడు దుర్మార్గమైన, అసభ్యకరమైన ట్రోలింగ్ ప్రారంభించాడు. దాని మీద సురేఖ మాట్లాడిన మాటల మీద స్వయంగా కేటీఆర్ కల్లబొల్లి ఏడుపులు అని వెటకారంగా వ్యాఖ్యానించాడు. దానికి జవాబుగా మాటకు మాటగా ఆమె తీవ్రంగా అభ్యంతరకరమైన, ఖండించవలసిన మాటలు మాట్లాడింది. వ్యాఖ్యలు ఎవరి మీద ఎక్కుపెట్టారో వారి మీద మాత్రమే కాకుండా, ప్రస్తుత సందర్భంలో సంబంధం లేని వ్యక్తుల మీద, కుటుంబాల మీద, వారి నైటీక ప్రవర్తన మీద వ్యాఖ్యలు చేసింది. అందులోనూ స్త్రీల వ్యక్తిగత జీవితానికి, గోప్యతకు సంబంధించి వ్యాఖ్యలు చేసింది.
చర్చ ఆ వ్యాఖ్యలు నిరాధారమైనవా, ఎంతో కొంత ఆధారం ఉందా, ఉంటే రుజువు చేస్తారా వంటి అనేక విషయాల చుట్టూ తిరిగింది గాని సందర్భం ఏదైనా స్త్రీలను అవమానించడం ఎందుకు జరుగుతుందని పెద్ద చర్చ జరగలేదు. మాట్లాడుతున్నవారు ఒక స్త్రీ అయి ఉండి కూడా, తాను ట్రోలింగ్ కు గురైన బాధితురాలిగా ఉండి కూడ, మరొక స్త్రీ మీద నిందలు వేయడం తప్పు అని చర్చ జరగలేదు.
ఇది కేవలం ఇవాళ సురేఖ చేసిన ఆరోపణలకు పరిమితమైనది కాదు, గత పది సంవత్సరాలలో జరిగిన ఫోన్ టాపింగ్ అక్రమంతో సహా, తెలుగు సినిమా రంగంలో జరుగిందంటున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణలను తొక్కిపట్టడంతో సహా, సినిమా నటుల మాదకద్రవ్యాల వాడకం కేసులను అప్పటి ప్రభుత్వ కీలక నాయకులకు ఉన్న సంబంధం వల్లనే ముందుకు తీసుకుపోలేదనే సమాచారంతో సహా ఎన్నో విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సురేఖ తప్పుడు వ్యాఖ్యను ఎంత ఖండించినా ఎప్పుడో ఒకసారి ఈ విషయాలు చర్చకు రావలసినవే.
ఒక స్త్రీగా సురేఖ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు, ఆ ట్రోలింగ్ తమ పక్షానికి చెందినవారే జరిపినప్పుడు సున్నితత్వం ఉన్న రాజకీయ నాయకులైతే తమ వారిని మందలించాలి. ఆ ట్రోలింగ్ ను ఉపసంహరించాలి. ఆ క్షణానికి బాధితులైనవారికి క్షమాపణలు చెప్పాలి. అంతకు ముందూ ఆ తర్వాత బద్ధ శత్రువులే అయినా, ఒకరి మీద ఒకరు ఎన్ని దూషణలైనా చేసుకోవడానికి అవకాశం ఉన్నా, ఆ క్షణపు సందర్భం ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నది గనుక దాన్ని ఉపసంహరించుకోవాలి. అలా చేయకపోగా ఆ బాధ వ్యక్తీకరణ మీద వెటకారం చేయడం మొరటుతనం. ఆ మొరటుతనానికి జవాబు అంతకు మించిన మొరటుతనంతో వచ్చింది. దాని మీద స్పందనలు ఒక వ్యక్తిని కాపాడడానికో, ఒక కుటుంబాన్ని కాపాడడానికో, ఒక పరిశ్రమను కాపాడడానికో పరిమితమయ్యాయి, అవకాశం దొరికింది గదా అని దూషణలూ నిందలూ చెలరేగాయి గాని చర్చ మౌలిక విషయాలలోకి వెళ్లలేదు.
ఇది కేవలం ఇవాళ సురేఖ చేసిన ఆరోపణలకు పరిమితమైనది కాదు, గత పది సంవత్సరాలలో జరిగిన ఫోన్ టాపింగ్ అక్రమంతో సహా, తెలుగు సినిమా రంగంలో జరుగిందంటున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణలను తొక్కిపట్టడంతో సహా, సినిమా నటుల మాదకద్రవ్యాల వాడకం కేసులను అప్పటి ప్రభుత్వ కీలక నాయకులకు ఉన్న సంబంధం వల్లనే ముందుకు తీసుకుపోలేదనే సమాచారంతో సహా ఎన్నో విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సురేఖ తప్పుడు వ్యాఖ్యను ఎంత ఖండించినా ఎప్పుడో ఒకసారి ఈ విషయాలు చర్చకు రావలసినవే.
ఇదే రాజకీయ రంగం, ఈ రాజకీయ నాయకులే గతంలో ఎందరెందరో స్త్రీలు, పురుషులు అవమానాలకు, వేధింపులకు, హింసకు, దౌర్జన్యానికి గురయినప్పుడు నోరు మెదపలేదు. ఇక ఇదే సినిమా రంగం స్త్రీని అమ్మకపు సరుకుగా, భోగవస్తువుగా, వ్యక్తిత్వం లేని బొమ్మగా చూపింది, తయారు చేసింది. సమాజంలో అటువంటి ప్రతీకలు విశ్వరూపం ధరించడానికి కారణమైనదే ఆ పరిశ్రమ. తమ సినిమాల ద్వారా ఆ నీచ విలువలను ప్రచారం చేసిన వారే ఇవాళ ఆ విలువలను ప్రశ్నించేవారుగా నటిస్తున్నారు. అసలు మొత్తంగా సమాజంలోనే అసమానతకు, ప్రత్యేకించి స్త్రీల మీద చిన్నచూపుకు, వ్యతిరేకతకు, వివక్షకు, హింసా సమర్థనకు దారి తీసే విలువలను అన్ని మత గ్రంథాలూ, ప్రత్యేకించి మనుస్మృతి మన సామాజికీకరణలో భాగం చేశాయి.
ప్రశ్నించవలసింది ఒక్క సురేఖనో, కెటిఆర్ నో కాదు. ఇది ఇప్పుడే వారితోనే మొదలు కాలేదు. మన సామాజికీకరణ, సంస్కృతి దుర్గంధమే అది. అసలు కడగవలసింది అది.