బాసర, ప్రజాతంత్ర,నవంబర్ 11: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో సోమవారం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం…నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన స్వాతి పీయూసీ సెకండియర్ చదువుతోంది. ఈ క్రమంలో తన హాస్టల్ గదిలోకి వెళ్లిన స్వాతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే స్వాతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.