విద్యార్థులే తెలంగాణ భవిష్యత్‌

విద్యా విధానంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నాం
•బడ్జెట్‌లో విద్యా శాఖకు 7 శాతం పైగా కేటాయింపు
•ప్రభుత్వ హాస్టల్స్‌లో కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీలు పెంచాం..
•హాస్టళ్లలో కలుషిత ఆహారం సరఫరా చేస్తే జైలుకే..
•వ్యసనాలకు బానిసలం కామని విద్యార్థులంతా మాట ఇవ్వండి..
•బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి
•దివంగత ప్రధాని నెహ్రూకు ఘన నివాళి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్తు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యావిధానం విప్లవాన్ని తీసుకొచ్చి అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూది అని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం మొదటి ఏడాది ఉత్సవాలను ఇక్కడ బాలల దినోత్సవంతో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని   సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. నవంబర్‌ 14 ‌బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌?‌లోని ఎల్బీ  స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వరంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగించారు.
ఉచిత నిర్బంధ విద్య ద్వారా పేదలకు విద్యను అందించేందుకు సోనియాగాంధీ, మన్మోహన్‌ ‌సింగ్‌ ఎం‌తో కృషి చేశారని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ ‌లో 7శాతానికి పైగా విద్యా శాఖకు కేటాయించిందని తెలిపారు. 20 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేశామన్నారు.  డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించామన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ అం‌దించాలని నిర్ణయం తీసుకున్నామని,  పాఠశాలల్లో అటెండర్స్, ‌స్వీపర్స్, ‌పారిశుద్ధ్య నిర్వణకు ప్రతీ ఏటా రూ.150 కోట్లు కేటాయించామని తెలిపారు.  గతంలో వీసీలను నియమించకపోవడంతో యూనివర్సిటీలు నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది.  అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే యూనివర్సిటీలకు వీసీలను నియమించాం.. త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌పోస్టులు భర్తీ చేయబోతున్నాం. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి విద్యా కమిషన్‌ ‌నియమించుకున్నాం. 26,854 ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 11వేల పై చిలుకు ఉన్న ప్రయివేట్‌ ‌పాఠశాలల్లో 36 లక్షల విద్యార్థులు చదువుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పునరుద్ధరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళండి.. విద్యార్థుల సమస్యలు తెలుసుకోండి. వారంలో రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలల ను పర్యవేక్షించాలని ఇప్పటికే కలెక్టర్స్ ‌ను ఆదేశించామని తెలిపారు.

కలుషిత ఆహారం సరఫరా చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సిందే..
హాస్టల్స్‌లో  కలుషిత ఆహారం సరఫరా చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి హెచ్చిరించారు.. నాసిరకం సరుకులు సరఫరా చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సిందేనన్నారు. ప్రభుత్వ హాస్టల్స్ ‌లో కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీలు పెంచి ఘనత మన ప్రభుత్వానిది. విద్యార్థులారా.. మీరే ఈ తెలంగాణకు పునాదులు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే మాలాంటి వారు ఈ వేదికపై ఉన్నాం.. విద్యకు ప్రాధాన్యతనిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. తెలంగాణ గురుకులాల్లో సన్నబియ్యంతో మంచి ఆహారం అందించాలని సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్‌ అం‌దిస్తున్నాం. మీరు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రజా ప్రతినిధులు, డాక్టర్స్, ‌లాయర్స్, ఇం‌జనీర్స్, ఉన్నతాధికారులుగా ఎదగాలి. కుక్క పిల్ల చనిపోతే డాక్టర్‌ ‌ను జైల్లో వేసిన పరిస్థితి ఆనాటి ముఖ్యమంత్రిది. మాసాయిపేట విద్యార్థులు చనిపోతే కన్నీరు కూడా కార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి.. కానీ ఈ ముఖ్యమంత్రి మీతో నడిచి మీతో చేయి కలుపుతున్నాడు..

ఇవాళ మీతో కలిసి బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాడు. దీనికి కారణం ప్రభుత్వం మారింది.. రాష్ట్రంలో మార్పు వొచ్చింది.. తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరుగెత్తుతోంది. చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ ‌కు బానిసలు అవుతున్న పరిస్థితి. వ్యసనాలకు బానిసలం కామని విద్యార్థులంతా నాకు మాట ఇవ్వండి.. సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరతామని చెప్పండి. వచ్చే ఒలింపిక్స్ ‌లక్ష్యంగా యంగ్‌ ఇం‌డియా స్పోర్టస్ ‌యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. చదువుతో పాటు క్రీడల్లో రాణించండి.. మట్టిలో మణిక్యాలని వెలికితీసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇం‌డియా ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ అం‌దుబాటులోకి తీసుకురాబోతున్నాం. మీ అభ్యున్నతికి కోసం ప్రభుత్వం పని చేస్తుంది.. ఈ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా… ముళ్ల కంచెను తొలగించి బంగారు బాట వేసే బాధ్యత నేను తీసుకుంటా.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 25ఏళ్ల వయసు నిబంధన ఉంది… 21ఏళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు కోసం అసెంబ్లీలో రెజల్యూషన్‌ ‌మూవ్‌ ‌చేయాలని శ్రీధర్‌ ‌బాబుకు  విజ్ఞప్తి చేస్తున్నా… దీనివల్ల రాజకీయాల్లో యువతరానికి అవకాశాలు పెరుగుతాయి. మీ కళ్ళల్లో కాంతిని మాకు సంపూర్ణ విశ్వాసం, సంతోషాన్ని కలిగించింది.

కులగణన సర్వేపై సీఎం కీలక వ్యాఖ్యలు
కులగణన సర్వేపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన సర్వే కోసం అధికారులు ఇంటింటికి వొస్తున్నారని,  కులగణనకు సహకరించి విజయవంతం చేయాలని విద్యార్థులంతా మీ తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలంటే కులగణన సర్వే జరగాలి.. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. కొంతమంది కుట్ర పూరితంగా కులగణన సర్వేపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు…. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది. ఇది ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తొలగొంచడానికి కాదు… కులగణన సర్వే మెగా హెల్త్ ‌చెకప్‌ ‌లాంటిది.. కులగన సర్వేకు అడ్డు వస్తే వారిని ద్రోహులుగా భావించండి అని సీఎం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page