ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?
నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…