అడ్డంకులను అధిగమించి.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి!
ఆధునిక మహిళలు తమ కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోలేని అనేక ఇబ్బందులను ఇపుడు ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని సైతం పురుషాధిక్య సమాజం సహించలేకపోతోంది. అణచివేతకు గురైన స్త్రిలు.. గతంలో తమకు ఎదురైన చేదు ఘటనలను నేడు బహిర్గతం చేస్తుంటే.. ‘అప్పుడు ఎందుకు చెప్పుకోలేద’ని సమాజం నిలదీస్తోంది. మహిళను ఒక పనిముట్టుగా చూసే సమాజం…