ఆవ్వ సుద్దులు
అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్ అశ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్ నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్ ఉదాసీనం…