అనంతాన్వేషణ…
కవిత్వాన్ని ఒక ప్రపంచంగా నిర్మించుకొని జీవజలంగా భావజాలాన్ని ప్రసరింపజేయడం కవికి ఒక సాహసమే. కవిత్వంతో విస్తరిస్తూ పోవడం కవికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం. హృదయం దృవీభవిస్తే అశ్రువంత స్వచ్ఛంగా కవిత్వం వెలువడుతుందన్నది కవి విశ్వాసం. అక్షరం అశ్రువులను తుడిచి స్వాంతన చేకూర్చే పరమావధి అని నమ్మి కవిత్వాన్ని తపస్సుగా కొనసాగిస్తున్న కవి దండమూడి శ్రీచరణ్.…