చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!
ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా మార్కెట్ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…