రాజీపడని యోధుడు కాళోజీ
‘‘ మానవతకు తలవొంపులు కలిగినప్పుడు,అన్యాయం, అవినీతి, అమానుషత్వం,దౌర్జన్యం విలయతాండవం చేసిన ప్పుడు ఆక్రందన వినిపించినప్పుడు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతున్నదని భావించినప్పుడు కాళోజీ ఎంతటి త్యాగానికైనా సాహసించారు.కాళోజీ నిరంతరం అన్యాయాలను అక్రమాలను ఖండీస్తూ సామాజిక బాధ్యత తో కలాన్ని ఖడ్గంగా ఉపయోగించారు. దీనికి ప్రేరణ ఖలీల్ జిబ్రాన్ ప్రొఫేట్ కు తెలుగు అనువాదం జీవన గీతం పేరుతో…